Ad Code

స్విమ్మింగ్‌ రోబోలతో చికిత్స !

గొప్ప ఆవిష్కరణలన్నీ చాలావరకూ ప్రకృతిని చూసి ప్రేరణ పొందినవేనన్నది నిర్వివాదాంశం. సృష్టి గమనంలో కీలకమైన గర్భందాల్చే ప్రక్రియలో ఫలదీకరణ కోసం శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే సంక్లిష్ట ప్రయాణం.. వైద్యచికిత్సలో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణగా మారనున్నది. అందులో తొలి అడుగే 'రాకెట్‌షిప్‌’ చికిత్స. 

ఏమిటీ 'రాకెట్‌షిప్‌’ చికిత్స?

ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో చేర్చడానికి రాకెట్‌ (వ్యోమనౌక) ఎలా సాయపడుతుందో.. ఔషధాలతో నిండిన అత్యంత సూక్ష్మ రోబోలను లక్షిత ప్రదేశాలకు చేర్చడానికి ఉద్దేశించిందే 'రాకెట్‌ షిప్‌’ చికిత్స. వ్యాధిసోకిన అవయవానికి మాత్రమే డైరెక్టుగా మెడిసన్‌ను అందించడం ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఇటీవల చేపట్టిన ఈ చికి త్స సత్ఫలితాలనిచ్చింది.

పనిచేసే విధానం 

'రాకెట్‌ షిప్‌’ చికిత్సలో సూక్ష్మ రోబోలుంటాయి. వ్యాధిసోకిన అవయవానికి ఔషధాన్ని తీసుకుపోవడానికి శుక్రకణాల మాదిరిగా రక్తప్రవాహానికి వ్యతిరేకంగా ఇవి ఈదుతాయి. అందుకే వీటిని 'స్విమ్మింగ్‌ రోబోట్స్‌’ అనిస్విమ్మింగ్‌ రోబోలతో చికిత్స

గొప్ప ఆవిష్కరణలన్నీ చాలావరకూ ప్రకృతిని చూసి ప్రేరణ పొందినవేనన్నది నిర్వివాదాంశం. సృష్టి గమనంలో కీలకమైన గర్భందాల్చే ప్రక్రియలో ఫలదీకరణ కోసం శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే సంక్లిష్ట ప్రయాణం.. వైద్యచికిత్సలో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణగా మారనున్నది. అందులో తొలి అడుగే 'రాకెట్‌షిప్‌’ చికిత్స. 

ఏమిటీ 'రాకెట్‌షిప్‌’ చికిత్స?

ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో చేర్చడానికి రాకెట్‌ (వ్యోమనౌక) ఎలా సాయపడుతుందో.. ఔషధాలతో నిండిన అత్యంత సూక్ష్మ రోబోలను లక్షిత ప్రదేశాలకు చేర్చడానికి ఉద్దేశించిందే 'రాకెట్‌ షిప్‌’ చికిత్స. వ్యాధిసోకిన అవయవానికి మాత్రమే డైరెక్టుగా మెడిసన్‌ను అందించడం ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఇటీవల చేపట్టిన ఈ చికి త్స సత్ఫలితాలనిచ్చింది.

పనిచేసే విధానం 

'రాకెట్‌ షిప్‌’ చికిత్సలో సూక్ష్మ రోబోలుంటాయి. వ్యాధిసోకిన అవయవానికి ఔషధాన్ని తీసుకుపోవడానికి శుక్రకణాల మాదిరిగా రక్తప్రవాహానికి వ్యతిరేకంగా ఇవి ఈదుతాయి. అందుకే వీటిని 'స్విమ్మింగ్‌ రోబోట్స్‌’ అని అంటున్నారు. ఈ రోబోలపై ఉన్న ఖాళీ ప్రాంతంలో ఒక బుడగలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ప్రదేశంలోకి ఆల్ట్రాసౌండ్‌ తరంగాలను పంపి రోబో ప్రయాణించడానికి అవసరమైన శక్తిని అందిస్తారు. శరీరానికి హాని కలుగజేయని జీవపదార్థంతో తయారైన ఈ రోబోలు.. పని పూర్తయ్యాక రక్తంలో కలిసిపోతాయి. శరీరంలోని కీలక ఆవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ లేదా ప్రమాదం జరిగినప్పుడు నోటి ద్వారా లేదా సూది మందుతో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇలాంటివి చేసేటప్పుడు కొన్నిసార్లు రోగి బలహీనతకు గురవ్వడం, ఇతర అవయవాలపై ప్రధాన చికిత్స దుష్ప్రభావం చూపడం జరుగుతున్నది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకిన అవయవానికే డైరెక్టుగా ఔషధాన్ని చేరిస్తే, ఇతరత్రా దుష్ప్రభావాలు ఉండవన్న ఉద్దేశంతో ఈ చికిత్సను ప్రతిపాదించారు. అంటున్నారు. ఈ రోబోలపై ఉన్న ఖాళీ ప్రాంతంలో ఒక బుడగలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ప్రదేశంలోకి ఆల్ట్రాసౌండ్‌ తరంగాలను పంపి రోబో ప్రయాణించడానికి అవసరమైన శక్తిని అందిస్తారు. శరీరానికి హాని కలుగజేయని జీవపదార్థంతో తయారైన ఈ రోబోలు.. పని పూర్తయ్యాక రక్తంలో కలిసిపోతాయి. శరీరంలోని కీలక ఆవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ లేదా ప్రమాదం జరిగినప్పుడు నోటి ద్వారా లేదా సూది మందుతో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇలాంటివి చేసేటప్పుడు కొన్నిసార్లు రోగి బలహీనతకు గురవ్వడం, ఇతర అవయవాలపై ప్రధాన చికిత్స దుష్ప్రభావం చూపడం జరుగుతున్నది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకిన అవయవానికే డైరెక్టుగా ఔషధాన్ని చేరిస్తే, ఇతరత్రా దుష్ప్రభావాలు ఉండవన్న ఉద్దేశంతో ఈ చికిత్సను ప్రతిపాదించారు.

Post a Comment

0 Comments

Close Menu