Ad Code

మొదటిరోజు పూజ ఎలా చేయాలి?

 


మహాలయ అమావాస్య తర్వాత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇది తొమ్మిది రోజులపాటు వైభంగా నిర్వహిస్తారు. శరదృతువు ప్రారంభం కాబట్టి శారది నవరాత్రి అని కూడా అంటారు. ఈ 9 రోజుల్లో భక్తులు 9 రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రులు 2021 అక్టోబర్‌ 7 నుంచి ప్రారంభమై 15న ముగుస్తుంది. హిందూవుల అతిపెద్ద పండుగ దసరా Dussehra . నవరాత్రి ఉపవాసాలు ప్రతి మానవునికి జీవితావసరాలు, ధాన్యం, శాశ్వత ఆనందం, దీర్ఘాయువు, ఆరోగ్యం, స్వర్గం, గృహ సాధనకు అవసరమైన ఉపవాసాలను జరుపుకుంటారు.నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు. ప్రతిరోజూ నవరాత్రుల్లో ఇంట్లో పెట్టుకున్న అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు సమర్పించడం ఆచారం. ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కోరోజూ అమ్మవారిని ఒక్కో రకమైన పూలతో అలంకరిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నవరాత్రిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ముందుగా అమ్మవారి ఫోటో ఉంటే.. బాగా శుభ్రం చేయాలి. విగ్రహం ఉన్నా.. ఫర్వాలేదు. అయితే దీన్ని పీఠం మీద పెట్టుకోవాలి. ముందుగా ఒక నియమం తీసుకోవాలి. అదే రోజుకు రెండు మార్లు పూజ చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. పూజ చేసే ముందు అఖండ దీపం వెలిగించుకోవాలి. మొదట సంకల్పం చెప్పాలి. మీ మనస్సులో సంకల్పించుకోవాలి. అమ్మవారి చల్లని చూపు కోసం సంకల్పించుకోవడం ముఖ్యం. షోఢశోపచార వ్రతం వస్తే ఆచరించవచ్చు. వచ్చిన వారికి కాళ్లు కడుక్కోవడానికి నీరు ఇచ్చి, పసుపు, కుంకుమ వివిధ రకాల ఉపచారాలు చేయాలి. కుదరకపోయిన ఫర్వాలేదు. మనస్సులో అమ్మవారిని ఆహ్వానించాలి. మంత్రం చదవకపోయినా.. మనస్ఫూర్తిగా చేయాలి. లలితా సహస్త్రనామం, ఖడ్గమాల, సౌందర్య లహరి, కనకధార స్తోత్రం ఈ నాలుగు శ్రీవిద్యకు ఫేసేస్‌. అందులో లలితా సహస్త్రనామం చేసేటపుడు కుంకుమతో అర్చించాలి. మిగతావి చదువుకోవాల్సినవి. సౌందర్య శ్లోకాలు రోజుకు పది చదివితే సరిపోతుంది. ఈ రోజు అమ్మవారికి మల్లెపూలు, విరజాజిపూలతో పూజిస్తారు. మొదటి రోజు అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. నవరాత్రి మొదటిరోజు అమ్మకు పొంగల్‌ నైవేద్యం పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. మొదటిరోజు పూజా సమయం ఉదయం10.30-12.00 వరకు. సాయంత్రం 6.00 -7.30 వరకు.

Post a Comment

0 Comments

Close Menu