Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్


దసరా, దీపావళి సందర్భంగా ఇంట్లోకి టీవీ, ఫ్రిజ్ తీసుకోవాలనుకుంటున్నారా? కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ మీకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేసే అవకాశం కల్పిస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఆఫర్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' ఆఫర్‌లో భాగంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించొచ్చు. 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' ఆఫర్ కొత్తదేమీ కాదు. గతంలో ఉన్నదే. కానీ గతంలో క్రెడిట్ లిమిట్ కేవలం రూ.10,000 మాత్రమే ఉండేది. అంటే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు పే లేటర్ ఆప్షన్ ద్వారా గరిష్టంగా రూ.10,000 మాత్రమే క్రెడిట్ పొందే అవకాశం ఉండేది. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడంతో బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ కన్నా ముందే 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' ఆఫర్‌లో క్రెడిట్ లిమిట్‌ను భారీగా పెంచింది ఫ్లిప్‌కార్ట్. గతంలో రూ.10,000 ఉన్న లిమిట్‌ను ఏకంగా రూ.70,000 చేసింది. కరోనా వైరస్ సంక్షోభంతో అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో షాపింగ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు చెల్లించకుండా షాపింగ్ చేసి ఈఎంఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అందుకే క్రెడిట్ లిమిట్‌ను ఏకంగా రూ.10,000 నుంచి రూ.70,000 చేసింది. ఈ మొత్తంతో కస్టమర్లు స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ కొనేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని 10 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లభిస్తోంది. వారంతా పే లేటర్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువు కొనొచ్చు. పే లేటర్ ఆప్షన్ ద్వారా క్రెడిట్ లిమిట్ పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాలి. ఆ తర్వాతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్ కార్ట్‌లో యాడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ సెక్షన్‌లో పే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత టెన్యూర్ సెలెక్ట్ చేయాలి. ఎంత ఈఎంఐ చెల్లించాలో అక్కడ వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రతీ నెలా ఈఎంఐ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ మాత్రమే కాదు... అనేక కంపెనీలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ అందిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu