ఫేస్‌బుక్‌లో సమస్యలు ఇప్పుడే ముగిసేలా కన్పించడం లేదు. కొద్దిరోజుల క్రితం మాజీ ఉద్యోగి రూపంలో ఫేస్‌బుక్‌పై పిడుగు పడితే, ఇప్పుడు మరో విజిల్‌బ్లోయర్ కంపెనీ చీకటి నిజాలను బయటపెట్టారు. ఇంటిగ్రీటి టీమ్ మాజీ సభ్యుడు ఫేస్‌బుక్‌పై మరికొన్ని ఆరోపణలను చేశారు. పలుదేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలను, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఫేస్‌బుక్ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను అరికట్టడంలో ఫేస్‌బుక్ తీవ్రంగా విఫలమైందని, కంపెనీ ఎప్పుడు లాభాల కోసమే పాకులాడదనే ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన వ్యాఖ్యలను బలపరుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. ఫేస్‌బుక్ ఇంటిగ్రీటి టీమ్‌లో భాగమైన ఈ కొత్త విజిల్‌బ్లోయర్ తన ఆరోపణలను అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్ట్‌తో పంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌పై అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భయపడి భద్రతా నియమాలను అమలు చేయడానికి ఫేస్‌బుక్ నిరాకరించిందని ఆరోపించారు. కొత్త విజిల్‌బ్లోయర్ చేసిన ఆరోపణలు ఫ్రాన్సిస్ హుగెన్ చేసిన ఆరోపణలను బలపరుస్తున్నాయి.
0 Comments