Ad Code

ఓం పురి


ఓం పురి ఒక అంతర్జాతీయ భారతీయ నటుడు. బాలీవుడ్ సినిమాల్లోనే గాక హాలీవుడ్, కొన్ని పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించారు. పలు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందారు. బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో  నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నందితాకు భరణం కింద ప్రతినెలకు 1.25 లక్షల రూపాయలు. కుమారుడికి 50 వేల రూపాయలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వైద్య, విద్య ఖర్చుల కోసం పత్రినెల 1.15 లక్షలు చెల్లించాలని ఓం పురికి ఆదేశించింది. ఆదాయ వనరుల లేమి ఉన్నందున్ననందితా లీగల్ ఖర్చుల కింద 25 వేల రూపాయలు కూడా ఓంపురి చెల్లించాలని తీర్పులో పేర్కోంది. ఇవియే కాకుండా నందితా కోసం చెల్లిస్తున్న ఇన్పూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ పాలసీలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలను ఓంపురి చెల్లించారు. వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని, తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు. 2017, జనవరి 6 శుక్రవారం ఉదయం గుండెపోటుతో తన స్వగృహంలో మరణించారు.

Post a Comment

0 Comments

Close Menu