Ad Code

ఇకపై మందులు, వ్యాక్సిన్లు అన్నీ రోదసిలోనే తయారీ...!



దివ్య సంజీవనిలు ఇకపై స్వర్గ సీమ నుంచి రానున్నాయి. అమృతానికి ఏ మాత్రం తీసిపోని స్వచ్ఛత, రోగాలను చిటికెలో మాయం చేసే శక్తి వీటి సొంతం. వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే ఈ వైద్య పరికరాలు, ఔషధాలను అంతరిక్షంలో తయారుచేయడానికి శాస్త్రవేత్తలు కార్యోన్ముఖులయ్యారు. ఈ ప్రాజెక్టుకు 'రోదసిలో తయారీ' గా నామకరణం చేశారు

'రోదసిలో తయారీ' అంటే?

భూమి మీద ప్రయోగశాలల్లో తయారుచేసే వైద్య పరికరాలు, ఔషధాలు, వ్యాక్సిన్లను ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క ల్యాబ్‌లలో తయారుచేస్తారు. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ ఫోర్జ్‌’తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. ల్యాబ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఫోర్జ్‌స్టార్‌ వ్యోమనౌకనూ సిద్ధం చేస్తున్నది. ఈ ప్రయోగం 2022 లేదా 2023లో చేపట్టనున్నారు.

రోదసిలో ఎందుకు?

రోదసిలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉండవన్న విషయం తెలిసిందే. రోగాలను నయంచేసే ఔషధాలు, వ్యాక్సిన్లను అంతరిక్షంలోని స్వచ్ఛమైన పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తే వాటిపై సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో ఔషధాల పనితీరు, జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఔషధ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. ఇక, సున్నితమైన వైద్య పరికరాల తయారీలో వినియోగించే లోహాలను వివిధ సాంద్రతల్లో కలపాల్సి ఉంటుంది. భూమి మీద ఉన్న పీడనం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఆ ప్రక్రియకు చాలా సందర్భాల్లో అంతరాయం కలుగుతున్నది

Post a Comment

0 Comments

Close Menu