Ad Code

ఎంత భారం?

 

ఖర్చులన్నీ గతేడాదితో పోలిస్తే 60 నుంచి 100 శాతం పెరిగాయి. కొద్దిమందికైనా భోజనాలు పెట్టాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.  హైదరాబాద్‌లో కేవలం 50 మందికి శాకాహార భోజనం పెట్టాలంటే కనీసం రూ.15 వేలు వసూలుచేస్తున్నారు. కొవిడ్‌కు ముందు గతేడాది ఈ ఖర్చు రూ.ఆరేడు వేలలో అయిపోయేది. పేద కుటుంబాల వారు భోజనంలో ఎక్కువ రకాల వంటకాలను అడగకపోయినా సంప్రదాయబద్ధంగా, రుచిగా ఉంటే చాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి భోజనం ప్లేటుకు రూ.250 నుంచి 300 వసూలు చేస్తున్నట్లు పలువురు క్యాటరింగ్‌ వ్యాపారులు చెప్పారు. భోజనంలో ఎన్ని స్వీట్లు, ఏయే రకాల వంటకాలు పెట్టాలనేదానిని బట్టి ఈ ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్నారు.

* మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. నెలక్రితం కిలో టమాటాలు రూ.5 కాగా ఇప్పుడు రూ. 40 నుంచి 50కి అమ్ముతున్నారు. పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర నెలరోజుల్లోనే రూ.140 నుంచి 155కి పెరిగింది.

* డీజిల్, పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో వాహనాల అద్దెలపై ప్రభావం పడుతోంది.

* వంటలు చేసేవారికి ఇవ్వాల్సిన కూలీరేట్లు పెరిగాయి.

* టెంట్లు, కుర్చీలు..ఇలా అన్నింటి కిరాయిలు అధికమయ్యాయి.

* గతేడాదంతా నోములు, వ్రతాలు, సామూహిక భోజనాలు వంటివి లేనందున పూజారులకు ఉపాధి తగ్గిపోయింది. పెరిగిన ఖర్చుల కారణంగా తమకివ్వాల్సిన దక్షిణ కూడా కొంతమేర పెంచినట్లు ఓ పూజారి వివరించారు.

* కొవిడ్‌కు ముందు పెద్ద ఫంక్షన్‌హాళ్లలో వందలమందికి భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు 50 నుంచి 100 మందినే ఆహ్వానిస్తున్నందున చిన్న హాళ్లు తీసుకుంటున్నారు. వీటి అద్దె, శుభ్రం చేయడం, భోజనం అన్ని కలిపి ప్లేటుకు హైదరాబాద్, వరంగల్‌, వైజాగ్, తిరుపతి వంటి నగరాల్లో రూ.377 నుంచి 400 దాకా వసూలు చేస్తున్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు ఇలాంటివాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.

* గత నెలలో వినాయక నవరాత్రులు, ఇప్పుడు దసరా, వచ్చేనెల దీపావళి, కార్తీకమాసం...ఇలా వరసగా పండగలు, సెలవులు, మంచిరోజుల కారణంగా సామూహిక భోజనాలు బాగా పెరిగాయి. గతేడాది ఈ రోజులతో పోలిస్తే తమ వ్యాపారం వందశాతం పెరిగిందన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu