Ad Code

నీటి శుద్ధి కోసం 'హైడ్రోజెట్‌ ట్యాబ్లెట్‌

 


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. అలాంటి ప్రదేశాల వారి కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక రకం హైడ్రోజెల్ టాబ్లెట్‌ను కనిపెట్టారు. నదులు, చెరువుల నీటిని గంటలోగా తాగేలా ఈ టాబ్లెట్ మార్చేస్తుండటం విశేషం. నీటిని 99.9 శాతం బ్యాక్టీరియా లేకుండా ఈ ట్యాబ్లెట్‌ చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ట్యాబ్లెట్‌ను సిద్ధం చేయడంలో అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. నీటిని సాధారణంగా బాక్టీరియా రహితంగా చేయడానికి వేడి చేయడం మాత్రమే మన ముందున్న సాధనం. ఇది సమయంతోపాటు శక్తిని కూడా తీసుకుంటుంది. అయితే, తాము కనిపెట్టిన హైడ్రోజెల్ టాబ్లెట్‌తో నీటిని తక్కువ సమయంలో శుద్ధి చేసి తాగొచ్చునని టెక్సాస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ హైడ్రోజెల్ టాబ్లెట్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. నీటిలో వేసిన తర్వాత ఈ టాబ్లెట్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కార్బన్‌తో కలిసి బ్యాక్టీరియాను చంపుతుంది. మానవుడికి హాని కలిగించే ఎలాంటి రసాయనం లేదా మరే ఇతర ఉత్పత్తిని నీటిలో కరిగినప్పుడు తయారు చేయదని పరిశోధనలో పేర్కొంటున్నారు. ఈ నీటిని ఎలాంటి భయం లేకుండా తాగవచ్చునని అభయమిస్తున్నారు. హైడ్రోజెల్ ప్యూరిఫైయర్‌లు ఇతర నీటి శుద్దీకరణ పద్ధతులను మెరుగుపరచడానికి బాగా పని చేస్తాయి. సోలార్‌ డిస్టిలేషన్‌ కోసం సూర్యుడి వేడి మీద ఆధారపడాలి. వేడి నుంచి ఆవిరైపోయే నీటిని ఈ విధానంలో సేకరిస్తారు. దీనిలోకి సూక్ష్మజీవులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త హైడ్రోజెల్ టెక్నాలజీతో నీటిని తక్కువ సమయంలో కొంచెం ఖర్చుతో పరిశుభ్రంగా చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu