Ad Code

ఇస్రోకు భారీ ప్రొపెల్లెంట్‌ ట్యాంక్‌ను తయారుచేసిన హెచ్‌ఏఎల్‌

 

అత్యంత భారీ సెమీ-క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను ఇండియన్‌ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌) అందించింది. భవిష్యత్ మిషన్ల కోసం ఎంకే-III ప్రయోగ వాహనంలో ఈ ట్యాంక్‌ను ఉపయోగించనున్నారు. సెమీ క్రియో లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌ఓఎక్స్‌) ట్యాంక్ మొదటి డెవలప్‌మెంటల్ వెల్డింగ్ హార్డ్‌వేర్ అనేది ఎస్సీ120 స్టేజ్‌లో భాగం. ఇది ప్రస్తుతం ఉన్న ఎంకే-III లాంచ్ వాహనంలో ఉపయోగించడం ద్వారా ఎల్‌110 స్టేజ్‌ని భర్తీ చేసి పేలోడ్ మెరుగుదల కోసం సహకరిస్తుంది. గత ఏడాది అతిపెద్ద క్రయోజెనిక్ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్‌ను ఇస్రోకు హెచ్‌ఏఎల్‌ పంపిణీ చేసింది. ఇది నాలుగు మీటర్ల వ్యాసం, ఎనిమిది మీటర్ల పొడవుతో ఉన్నది. ఒప్పంద షెడ్యూల్ కంటే చాలా ముందుగా చేరింది. వెల్డింగ్ ప్రొపెల్లెంట్ ట్యాంకుల తయారీకి కావల్సిన నైపుణ్యత, సాంకేతికతలపై హెచ్‌ఏఎల్‌ పట్టు సాధించింది. ఇవ్వాల్టి వరకు 244 ప్రొపెల్లెంట్ ట్యాంకులు, 95 వాటర్ ట్యాంకులు ఇస్రోకు పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎంకే-II, జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III కు హెచ్‌ఏఎల్‌ ఏరోస్పేస్ డివిజన్ అందించింది. గత ఐదు దశాబ్దాలుగా ఇస్రోకు అవసరమైన యంత్రాలను హెచ్‌ఏఎల్‌ తయారుచేసి ఇస్తున్నది. ఇప్పటివరకు క్రయో, సెమీ క్రయో ఇంజిన్లను తయారు చేసే గురుతర బాధ్యతను హెచ్‌ఏఎల్‌ తన భుజాలపై ఎత్తుకుని విజయవంతంగా పూర్తి చేసింది.

Post a Comment

0 Comments

Close Menu