Ad Code

అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్



ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్న యాప్స్ ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ రెండు  యాప్స్ ఇండియాలో బ్యాన్ అయినవే. అవి కేవలం అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ మాత్రమే కాదు. అత్యధికంగా రెవెన్యూ పొందిన యాప్స్ కూడా అవే. 2021 మూడో క్వార్టర్ లో అత్యధిక డౌన్ లోడ్స్, అత్యధిక సంపాదన కలిగిన యాప్స్ లిస్టును సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించింది. అందులో టాప్ లో ఉన్న యాప్స్ టిక్ టాక్, పబ్ జీ. ఈ రెండు యాప్స్ మన దేశంలో బ్యాన్ అయ్యాయి. ఈ రెండు కూడా చైనాకు చెందిన యాప్స్. ప్రతి సంవత్సరం టిక్ టాక్ లో ఒక యూజర్ గడిపే సమయం 41 శాతం పెరుగుతూ వెళ్తోందట. అదే పబ్ జీ గేమ్ లో ఒక యూజర్ ప్రతి సంవత్సరం గడిపే సమయం 11 శాతం పెరుగుతూ వెళ్తోందట. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్.. రెండింట్లో కలిపి.. 2021 మూడో క్వార్టర్ లో టిక్ టాక్, పబ్ జీ రికార్డ్ సృష్టించాయని సెన్సార్ టవర్ వెల్లడించింది. టిక్ టాక్ తర్వాతి స్థానాల్లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సప్, ఫేస్ బుక్ మెసెంజర్ ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్(300 కోట్లు) డౌన్ లోడ్స్ మార్క్ ను టిక్ టాక్ ఇటీవలే క్రాస్ చేసింది. మొబైల్ గేమ్స్ క్యాటగిరీలో పబ్ జీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దాని తర్వాతి స్థానాల్లో మై టాకింగ్ ఏంజెలా 2, సబ్ వే సర్ఫర్స్, కౌంట్ మాస్టర్స్, బ్యాటిల్ రాయలే గరెనా ఫ్రీ ఫైర్ రౌండెడ్ అప్ యాప్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu