Ad Code

మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన యూజర్లు...!

 

తాజాగా మైక్రోసాఫ్ట్‌కు యూజర్లు భారీ షాకే ఇచ్చారు. ఆయా సెర్చ్‌ ఇంజన్స్‌ అప్పడప్పుడు ఎక్కువగా సెర్చ్‌ చేసిన పదాలు ఏంటని ఆయా సెర్చ్‌ ఇంజన్స్‌ ప్రకటిస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్‌ ఇంజన్‌ బింగ్‌ కూడా యూజర్లు ఎక్కువగా వెతికిన పదాల చిట్టాను విడుదల చేసింది. ఈ విషయంలో బింగ్‌కు భారీ షాకే తగిలింది. బింగ్‌ సెర్చ్‌ ఇంజన్‌ను వాడుతున్న యూజర్లు ఎక్కువగా గూగుల్‌ను సెర్చ్‌ చేసినట్లు తేలింది. దీంతో బింగ్‌ను అభివృద్ధి చేసిన మైక్రోసాఫ్ట్‌ ఒక్కసారిగా కంగుతింది. సెర్చ్‌ ఇంజన్‌ ఎకోసిస్టమ్‌పై గూగుల్‌పై యూఎస్‌ కోర్టులో పలు దావాలు నమోదైనాయి. గూగుల్‌ పలు ఈలీగల్‌ ప్రాక్టిసెస్‌ చేసినందుకుగాను ఈయూ కోర్టు కూడా భారీ జరిమానాలను విధించింది. సెర్చ్‌ ఇంజన్‌ విషయంలో యూజర్లు ఎక్కువగా క్రోమ్‌నే కోరుకుంటున్నారు..వారిని ఏవరు బలవంతంగా ఆయా సెర్చ్‌ ఇంజన్‌నే వాడాలనే షరతును మేము ఏవర్నీకోరడం లేదంటూ గూగుల్‌ తన వాదనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ను ఆదరిస్తున్నారని గూగుల్‌ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu