Ad Code

పెరుగుతో ఇవి కలిపి తినకండి

 

భోజనంలో చివరి ముద్ద పెరుగుతో తినకుంటే అసలు ఆరోజు అసంపూర్తిగానే ఉంటుంది. ఎందుకంటే పెరుగు ప్రతి ఒక్కరికి అంతలా అలవాటైపోయింది. అయితే ఇది మంచిదే, పెరుగులో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ప్రతి రోజు పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. కానీ పెరుగుతో కలిపి కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ పాయిజన్‌గా మారే అవకాశం ఉంది. పాలు - పెరుగు రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు పాలు తాగితే పెరుగు తినకండి. పెరుగు తింటే పాలు తాగకండి. ఈ రెండు కలిపి తీసుకోకూడదు. ఇది గ్యాస్, డయేరియా, ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది. పెరుగు, చేపలను కలిసి తినకూడదు. ఈ రెండు కలిసి తినడం హానికరం. ఇది వాంతులు, అజీర్ణానికి దారితీస్తుంది. ఉల్లిపాయ వేడిగా ఉన్నప్పుడు పెరుగు చల్లగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల అలెర్జీలు, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు వస్తాయి. ఈ రెండింటినీ ఎప్పుడూ తినకూడదు. అరటిపండు, పెరుగును కలిపి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. మీరు బదులుగా పాలు, అరటిపండ్లు తినవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu