Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, November 16, 2021

చైనా నెంబర్ 1!

 

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచినట్లు 'బ్లూమ్‌బర్గ్' కథనం పేర్కొంది. గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగిందని, అమెరికాను దాటుకుని చైనా తొలి స్థానానికి ఎగబాకిందని తెలిపింది. మెక్‌కిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించి ఈ నివేదిక ఇచ్చినట్లు తెలిపింది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాలకు వచ్చినట్లు పేర్కొంది. ప్రపంచ నెట్ వర్త్ 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఇది 2000లో 156 ట్రిలియన్ డాలర్లు అని తెలిపింది. చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని వివరించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరడానికి ముందు 2000వ సంవత్సరంలో చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండేదని, ప్రస్తుతం ఇది 120 ట్రిలియన్ డాలర్లకు చేరిందని వివరించింది. ఇదే కాలంలో అమెరికా నెట్‌వర్త్ రెట్టింపు (90 ట్రిలియన్ డాలర్లు) అయిందని తెలిపింది. చైనా, అమెరికా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలని పేర్కొంది. చైనా, అమెరికాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే పోగుపడిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ సంపన్న కుటుంబాలు మరింత సంపదను పోగు చేసుకుంటున్నాయని వివరించింది. 68 శాతం గ్లోబల్ నెట్ వర్త్ రియల్ ఎస్టేట్‌లోనే ఉందని తెలిపింది. 

No comments:

Post a Comment

Popular Posts