Ad Code

మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్


మహారాష్ట్రలో మరో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ పేలింది. ఈ ఘటనలో ఫోన్ యూజర్ కు తీవ్ రగాయాలయ్యాయి. జీన్స్ ప్యాంట్ జేబులో పెట్టుకున్న సమయంలో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలిపోయింది. దాంతో అతడి తోడభాగానికి తీవ్రగాయమైంది. జీన్స్ జేబు కాలిపోయింది. ఫోన్ పేలిన ఫొటోలను యూజర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. యూజర్ ట్వీట్ చేయగానే.. వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ వెంటనే స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నేరుగా మెసేజ్ చేసి చెప్పాలని సూచించింది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పేలడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంలోనూ వన్ ప్లస్ నోర్డ్ 2 5G స్మార్ట్ ఫోన్లు పేలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కంపెనీ సూచించినట్టుగా డైరెక్ట్ గా వివరాలను మెసేజ్ చేసినప్పటికీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ, ఈమెయిల్ ద్వారా కంపెనీ ఒక ప్రకటన చేసింది.. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంటాం.. ఇప్పటికే సంబంధిత టీం బాధితుని వద్దకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలోనే ఉన్నామని వివరణ ఇచ్చింది. OnePlus Nord 2 5G స్మార్ట్ ఫోన్… గత జూలై నెలలో లాంచ్ అయింది.

Post a Comment

0 Comments

Close Menu