హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం దృశ్యం 2. మీనా, ఈస్తర్ అనిల్, కృతిక, నరేష్, నదియా, సంపత్ రాజ్, పూర్ణ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దృశ్యం 2 మరింత ఆసక్తిని కలిగించిన సంగతి తెలిసిందే. గతంలో వెంకీ ప్రధాన పాత్రలో వచ్చినా దృశ్యం సినిమాకు సిక్వెల్ ఈ చిత్రం. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్స్. దృశ్యం సినిమాను దృశ్యం 2 మూవీ మించిపోయిందని.. మరోసారి వెంకీ అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అలాగే స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, మ్యూజిక్ సూపర్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దృశ్యం 2 మూవీ ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎక్స్పీరియన్స్ అందించాయని తెలిపారు. అలాగే డైరెక్టర్ జీతు జొసెఫ్ తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను పోలీసులు మరోసారి తెరపైకి తీసుకురావడంతో రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఎంతో అద్భుతంగా చూపించారు డైరెక్టర్. మొత్తానికి దృశ్యం సినిమా మించిన ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దృశ్యం
0 Comments