Header Ads Widget

30న మోటో జీ200 విడుదల!

మోటోరోలా భారత్‌లో త్వరలో మరో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చిన మోటో జీ200ను మోటోరోలా ఈనెల 30న భారత్‌లో లాంఛ్ చేయనున్నట్టు టెక్ నిపుణుడు దేవయన్ రాయ్ వెల్లడించారు. స్నాప్‌డ్రాగన్ 888+తో కూడిన మోటో జీ200 ధర రూ 35,000. ఇక మోటో జీ200 ఫీచర్ల విషయానికి వస్తే..6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 13ఎంపీ అల్ట్రా వైడ్ మ్యాక్రో కెమెరా, డెప్త్ సెన్సర్‌తో పాటు 108ఎంపీ మెయిన్ కెమెరాతో అందుబాటులో ఉంటుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక 33డబ్ల్యూ ఫాస్ట్‌ఛార్జింగ్ సామర్ధ్యంతో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.


Post a Comment

0 Comments