మోటో ఈ40ను ఇటీవల లాంఛ్ చేసిన మోటోరోలా తాజాగా యూరప్ మార్కెట్‌లో మోటో ఈ30ను లాంఛ్ చేసింది. మోటో ఈ30 ఫీచర్ల విషయానికి వస్తే హెచ్‌డీప్లస్, యూనిసోక్ టీ700 చిప్‌సెట్‌తో కూడిన 6.5 ఇంచ్‌ల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జీవో ఎడిషన్‌పై రన్ అవుతుంది. మోటో ఈ40 డిజైన్‌ను పోలిన విధంగానే ఈ30 డిజైన్ రూపొందింది. మోటో ఈ30 రూ 8,570కు అందుబాటులో ఉంటుంది. భారత్ సహా ఇతర మార్కెట్లలో ఈ30 ఎప్పుడు లాంఛ్ అవుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ మినరల్ గ్రే, డిజిటల్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
No comments:
Post a Comment