Ad Code

విషాదంలో కన్నడ పరిశ్రమ


స్టార్ హీరో స్టాటస్ పొందడానికి ఎంతో కష్టపడతారు. అయినా ఆ గర్వం ఇసుమంతైనా కనిపించదు శాండల్ వుడ్ హీరోలకు.. ఆ సింబల్ అచ్చిరాదో ఏమో.. అకాల మృత్యువు వారిని తరుముకొస్తుంది. ఇంతకు ముందు ముగ్గురు హీరోలు.. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం కూడా అలాంటిదే. 2009 సంవత్సరంలో కన్నడ మెగాస్టార్‌గా పిలుచుకునే విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. పునీత్ తండ్రి రాజ్ కుమార్ తరువాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్నాడు విష్ణువర్ధన్. తన సినీ కెరీర్‌లో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన కూడా పునీత్ మాదిరిగానే గుండోపోటుతో మరణించాడు.1990లో శంకర్ నాగ్ అనే ఒక సూపర్ హీరో కేవలం 35 సంవత్సరాలకే మృత్యువాత పడ్డారు. తన సినిమాల ద్వారా అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. శంకర్ మరణించేనాటికి పది సినిమాలు విడుదల కావాల్సినవి ఉన్నాయి. దాదాపు నాలుగు సంవత్సరాలకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. దీనిని బట్టి కన్నడ సినీ పరిశ్రమలో ఆయన రేంజ్ ఏంటో అర్థమవుతుంది. సినిమా షూటింగ్‌లో భాగంగానే కారు నడుపుతూ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చే అప్పుడే పీక్ స్టేజ్‌కి వెళ్తున్న చిరంజీవి సర్జా రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించడం అభిమానులను కలచి వేసింది. కన్నడ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోలుగా ఎదిగి ఇలా అకాల మరణం చెందడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపుతోంది.

Post a Comment

0 Comments

Close Menu