Ad Code

సోషలిజం-కమ్యూనిజంపై పెరియార్

 

పెరియార్ ద్రావిడర్ కజగం మరియు ఆత్మగౌరవ ఉద్యమాన్ని భారతదేశంలో స్థాపించిన ప్రసిద్ధ సంఘ సంస్కర్త.  'ద్రావిడ ఉద్యమ పితామహుడు'గా ఆయన గుర్తింపు పొందారు. బ్రాహ్మణీయ భావజాలంతో పాటు లింగ, కుల అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి గొప్ప ఉద్యమాలను నిర్మించాడు. మహా మాంద్యం సమయంలో, 1929 మరియు 1935 మధ్య, అంతర్జాతీయ కమ్యూనిజం యొక్క అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆలోచనలను తీవ్రంగా కదిలించింది. వామపక్ష తత్వాలు భారతీయ రాజకీయ పార్టీలను, ఉద్యమాలను మరియు నాయకత్వంలోని ముఖ్యమైన భాగాలను కూడా బలంగా  ప్రభావితం చేశాయి. పెరియార్  ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఒక స్వతంత్ర ఉద్యమంగా నెలకొల్పిన తర్వాత రాజకీయంగా సామాజికంగా దానిని బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అలా చేయడానికి, అయన సోవియట్ యూనియన్‌తో సహా అనేక అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ దేశాల చరిత్రలను, రాజకీయాలను శోధించాడు ఆ భిన్న వ్యవస్థలను స్వయంగా ఆ దేశాలకు వెళ్లి  చూశాడు   ఈ ప్రక్రియ క్రమంలో కమ్యూనిస్ట్ ఆలోచన,  లక్ష్యాలచే ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో, అయన సోషలిజం మరియు కమ్యూనిజం గురించి ఈ క్రింది అభిప్రాయాలను వివిధ సందర్భాలలో వెలిబుచ్చాడు : "అన్ని కర్మాగారాలు మరియు వాటి నిర్వహణ పోస్ట్లల్, టెలిగ్రాఫ్‌లు, రైల్వేలు మరియు పబ్లిక్ వర్క్‌ల నిర్వహణవలె  ప్రభుత్వపరంగా ఉండాలి. దేశంలో ఒక్క పెట్టుబడిదారుడు కూడా ఉండ కూడదు. ఏ ఒక్క వ్యక్తి మనకు యజమాని కాకూడదు. ప్రజలు ఆందోళనలు ఇబ్బందులు మరియు ఒకరినొకరు మోసం చేయడం లేకుండా శాంతి, సంతృప్తితో జీవించాలంటే  ప్రస్తుత ప్రపంచంలో కమ్యూనిజం సూత్రం అమల్లోకి రావాలి. ఇక్కడ  అదృష్టానికి స్థానం లేదు. కానీ మన ప్రయత్నాలు సామాన్యులకు బాధలను, వినాశనాన్ని తేకూడదు. ఉద్రిక్తతలు మరియు వివక్షలు లేని స్థితి ఏర్పడాలంటే, అందరికీ సమాన అవకాశాలిచ్చే సోషలిజం నమూనాను సృష్టించాలి. దీన్ని తీసుకురావడానికి, ఆస్తిపై హక్కును రద్దు చేయాలి; ఆస్తి ఉమ్మడిగా ఉండాలి. కార్మికుల బాధలు, దిగుళ్ళు , ఆందోళనలు అంతం కావాలంటే పెట్టుబడిదారీ విధానాన్ని మూలాల్లోనే నాశనం చేయాలి. కమ్యూనిజం యొక్క అంతిమ లక్ష్యం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా ఉండే ప్రపంచ-క్రమాన్ని ప్రారంభించడం; అందులో  ప్రజలందరూ బంధువులు;   ప్రపంచంలోని సర్వ సంపదలు, దాని ఆనందాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఆ కుటుంబానికి చెందినవిగా వుండాలి ...."

- పెరియార్, 

Post a Comment

0 Comments

Close Menu