Ad Code

ద్వారం వెంకటస్వామి నాయుడు

 

రీ ద్వారం వెంకటస్వామి నాయుడు బెంగళూరులో దీపావళి నాడు జన్మించారు .వీరి నాన్నగారు వెంకటరాయుడు సైనికదళం లో కమిషన్డ్ ఆఫీసర్ గా పనిచేశారు . వెంకటస్వామి నాయుడు 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయోలిన్ ఆచార్యునిగా నియమితులయ్యారు. 1936 లో అదే కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యారు. వయోలిన్ ప్రధాన సాధనంగా ఒంటరి కచేరీలు ( సోలో కన్సర్ట్స్ ) ఇవ్వడం వీరే ఆరంభించారు. మొదటి కచేరి 1938 లో వెల్లూర్ లో జరిగింది. 1952 లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనశాల ఆడిటోరియంలో వీరి కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ కళాకారులు శ్రీ యెహూది మెనుహిం వీరి వయోలిన్ సంగీతాన్ని జస్టిస్ పి వి రాజమన్నార్ ఇంటిలో విని ఎంతో ప్రశంసించారు .  ద్వారం వెంకటస్వామి నాయుడు సారంగి వాదనలో సున్నితత్వానికి అందెవేసిన చెయ్యి. కర్ణాటక సంగీతం సారంగీపై వినిపించవచ్చునని తెలిపిన మొదటి వ్యక్తి వీరే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశారు .' తంబూరా విశిష్ట లక్షణాలు ' అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం ' వినిపించే తపస్సు 'అని ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదని వీరు శిష్యులకు చెప్పేవారు. ఒకరోజు సాధన మానితే మీ సంగీతం లోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతం లోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి అని చెప్పేవారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుండి 1941 లో సంగీత కళానిధి బిరుదును పొందారు .1953 లో సంగీత నాటక అకాడమీ అవార్డు 1957 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొందారు .భారతీయ తపాలాశాఖ వారు1993 లో శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు .రాజా లక్ష్మీ అవార్డు 1992 లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారిచే శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్ కు బహుకరించబడినది . 

Post a Comment

0 Comments

Close Menu