Ad Code

ప్రజల జీవిత కాలం తగ్గిపోవడానికి కారణాలేంటి ?


ఒకప్పుడు ఉన్న ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అప్పట్లో వైద్య సదుపాయాలు పెద్దగా ఉండేవి కావు అయినా అంత ప్రమాద మన పరిస్థితులు ఎవరికీ పెద్దగా వచ్చేవి కావు. అలాగే అప్పటి వాళ్ళల్లో ఎక్కువ మంది మినిమం 70 ఏళ్లు పైనే జీవించేవారు. 100 ఏళ్లు పైన జీవించే వారు కూడా ఎందరో అయితే దీనికంతటికీ కారణం ఆరోగ్యం. ఆరోగ్యం ఎపుడు మనం తినే ఆహారంపై, జీవన శైలిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్న విషయం జగమెరిగిన సత్యం. అందుకే అప్పటి ప్రజలు చాలా కాలం జీవించేవారు. వయసు మీరుతున్నా ఎవరి పనులు వారు చకచకా చేసుకునే వారు. శారీరక శ్రమ వుండడంతో  సన్నగా నాజూగ్గా, ఆరోగ్యంగా ఉండేవారు. అయితే తరాలు మారే కొద్ది, అభివృద్ధి పెరిగే కొద్ది మనుషుల్లోని వారి జీవనశైలిలోను ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని వలన కొంత వరకు మన ఆరోగ్యం కూడా కుంటుపడిందనే చెప్పాలి. అధిక రాబడి కోసం రసాయనాలతో, కృత్రిమ ఎరువులతో పండించే ఆహార పదార్థాలు. నిలువ చేయడానికి రసాయనాలు, వాషింగ్ మెషిన్ లు, వంటి వాటి వలన మనకు శరీర పని సులభం అవుతుంది. కానీ..శరీరానికి కాస్తో కూస్తో అందే వ్యాయామం కూడా దూరం అవుతుంది. ఇప్పటి వ్యవసాయ పద్దతులు, అధిక రసాయనాల వినియోగం మనం ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. మన జీవన విధానాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. ఉదయాన్నే లేవడం, పనులను చకచకా చేసుకోవడం, వీలైనంత వరకు వ్యాయామం చేయడం. వాకింగ్ చేయడం, మన ఇంటి పనులను సొంతంగా చేసుకోవడం, నూనె పదార్దాలను వీలైనంత వరకు దూరం పెట్టడం, జంక్ ఫుడ్ ను పూర్తిగా మానేయడం. వంటివి చేయడం ద్వారా మళ్ళీ ప్రజలు అప్పటి వారి లాగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి ఆస్కారం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu