Ad Code

ఎమర్జెన్సీ టైంలో స్పందించే కారు


జపాన్‌కి చెందిన ఆటో మేకర్‌ కంపెనీ మజ్దాకి ఇండియాతో అనుబంధం ఉంది. స్వరాజ్‌ కంపెనీతో కలిసి గతంలో ఈ సంస్థ పలు వాహనాలను ఇండియన్‌ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా ఎమర్జెన్సీ సమయంలో స్పందించే విధంగా సరికొత్త కారుని తయారు చేస్తోంది. కారులో అమర్చే ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు కారు చుట్టు పక్కలతో పాటు డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని గమనిస్తుంటాయి. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకుంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు కారు నడిపే వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎదురైనా, ప్రమాదాలు సంభవించినా వెంటనే అలెర్టయి పోతుంది. కారు వేగాన్ని తగ్గించి సురక్షితంగా రోడ్డు పక్కన ఆగేలా ఆటో పైలెట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా రోడ్డు యాక్సిడెంట్లను అరికట్టగలుగుతుంది. దీంతోపాటు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితులను అనుసరించి అంబులెన్స్‌, హస్పిటల్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ మెజేస్‌ పంపిస్తుంది. కెమెరాల ద్వారా మనిషి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా స్పందిపంచే టెక్నాలజీపై మజ్ధా సంస్థ కొంత కాలంగా పని చేస్తోంది. అందులో భాగంగా సుకుబా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు ఇతర మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిపుణులతో కలిసి టెక్నాలజీ డెవలప్‌ చేసింది. రియల్‌టైంలో మరికొన్ని సార్లు పరీక్షలు నిర్వహిస్తామని, ఏమైనా లోపాలు ఎదురైతే సవరించి 2025 కల్లా ఈ కొత్త టెక్నాలజీ కారును మార్కెట్లోకి తెస్తామంటూ మజ్దా ఘంటాపథంగా చెబుతోంది. కోటి రూపాయలు ఆపై ధర ఉన్న హైఎండ్‌ కార్లలో డ్రైవర్‌ను అలెర్ట్‌ చేసే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను కొన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇందులో ఖర్చు అధికంగా ఉండే లేజర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లేజర్‌ సాయం లేకుండా కేవలం కారులో అమర్చిన కెమెరాల ద్వారానే అలెర్ట్‌ సిస్టమ్‌ రూపొందించడమే టార్గెట్‌గా మజ​​‍్దా ముందుకు కదులుతోంది. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే ఎంట్రీ, మిడ్‌ రేంజ్‌ కార్లలో కూడా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని మజ​‍్దా హామీ ఇస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu