Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, November 11, 2021

పబ్‌జీ కొత్త వర్షన్ ఇండియాలో విడుదల


పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే కదా. అయితే  పబ్‌జీ న్యూ స్టేట్  పేరుతో కొత్త వర్షన్‌ను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. పబ్‌జీ గేమ్ లవర్స్ కోసం రూపొందిన గేమ్ ఇది. ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, ఐపాడ్ఓఎస్‌లలో డెవలప్ చేశారు. ఇండియాతో పాటు.. మరో 200 దేశాల్లో పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్‌ను లాంచ్ చేశారు. పబ్‌జీ నుంచి వచ్చిన కొత్త గేమ్ ఇది. దీన్ని గత ఫిబ్రవరిలోనే ప్రకటించి తాజాగా లాంచ్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ గేమ్‌లో ప్లేయర్స్ పొందొచ్చని పబ్‌జీ ప్రకటించింది. ఇందులో 100 మంది ప్లేయర్లు.. రకరకాల వెపన్స్‌, స్ట్రాటజీలను ఉపయోగించి గేమ్ ఆడొచ్చు. ఈ గేమ్‌ను పబ్‌జీ స్టూడియోస్ డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ 6.0, ఐఓఎస్ 13, ఐపాడ్ఓఎస్ 13 నుంచి లేటెస్ట్ వర్షన్ వరకు ఈగేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 17 భాషల్లో ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో బీజీఎంఐ అనే గేమ్‌ను క్రాఫ్టన్ సంస్థ లాంచ్ చేసింది. పబ్‌జీ బ్యాన్ తర్వాత వచ్చిన పబ్‌జీ తరహా గేమ్ అది. ఈ గేమ్ కంటే కూడా అత్యాధునికమైన వెపన్స్, ఫీచర్లతో ఇప్పుడు పబ్‌జీ.. న్యూ స్టేట్ గేమ్ లాంచ్ అయింది.

No comments:

Post a Comment

Popular Posts