చాచా నెహ్రూ
Your Responsive Ads code (Google Ads)

చాచా నెహ్రూ

 

భారత దేశ మొదటి ప్రధానమంత్రి , విదేశాంగమంత్రిగా నెహ్రూ నవ భారత ప్రభుత్వ విధానాలను రాజకీయ సంస్కృతిని , శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రారంభించి దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించ గలిగినందుకు అయన ప్రశంశించబడతారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైన అల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్లు అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ విద్యా విధానానిదే. భారతదేశ ప్రత్యేక జాతుల అల్ప సంఖ్యాక వర్గాల స్త్రీల షెడ్యూల్డ్ కులాల , షెడ్యుల్డ్ తెగలకు సమాన అవకాశాలు , హక్కులు కల్పించేందుకు విస్తృతమైన విధానాన్ని రూపొందించి స్థిరమైన చర్యలను నెహ్రూ చేపట్టారు.సమానత్వాన్ని నెలకొల్పాలనే నెహ్రూ ఆకాంక్ష ఆయన స్త్రీలు , అణగారిన వర్గాల కొరకు ప్రభుత్వ పధకాలు విస్తృతంగా రూపొందించి వాటి అమలుకు ప్రయత్నించేలా చేసింది అవి ఆయన జీవిత కాలంలో పరిమితంగానే విజయవంతమయ్యాయి. ఆయన భేదాలను గుర్తిస్తూ నే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్ర్య -అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధికి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించు కుంది. సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో నెహ్రూ నేషనల్ బుక్ ట్రస్ట్ , నేషనల్ లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు , విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు.సమైక్య భారతదేశం కోసం నెహ్రూ 'కలసిఉండడం లేదా నశించడం ', అని నినదించారు.జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్ధం 1989 లో యుఎస్ఎస్ఆర్  విడుదల చేసిన తపాలా బిళ్ళ .  పిల్లలకు మిఠాయిలు పంచుతున్న నెహ్రూ తన జీవిత కాలంలో నెహ్రూ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము , రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి. బాలల , యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి వారి శ్రేయస్సుకు విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జన్మ దినమైన 14 నవంబర్ భారతదేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయనను తరచూ వారు గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ఆయన వస్త్ర ధారణను ప్రత్యేకించిగాంధీ టోపీని , అలవాట్లను అనుకరిస్తుంటారు. నెహ్రూ ఆదర్శాలు , విధానాలు కాంగ్రెస్ ప్రకటన పత్రము (ముసాయిదా)ను , మూల రాజకీయ తత్వాన్ని రూపొందించడంలో నేటికీ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆయన వారసత్వ ప్రతినిధిగా ఇదిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ , ప్రభుత్వ నాయకత్వాన్ని చేపట్టారు.జవాహర్ లాల్ నెహ్రూ హైదరాబాదు అబిడ్స్ దగ్గరి విగ్రహము.నెహ్రూ జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు. 1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ లోను నెహ్రూ చే రచింపబడిన ది డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథం పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ లోను 2007 లో ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ అనే టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు పరిపూర్ణత నిచ్చారు. కేతన్ మెహతా చిత్రం సర్దార్లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు.శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారతదేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడంతో పాటు ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు.దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు జ్ఞాపక చిహ్నాలు నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ డాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం , గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్ భవన్ , స్వరాజ్ భవన్లు నెహ్రూ జ్ఞాపకార్ధం , కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (అఫ్సక్)ద్వారానోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ బడ్డారు.  పండిత జవహర్ లాల్ నెహ్రు గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog