Ad Code

శ్రీ వంగర వెంకట సుబ్బయ్య

 


శ్రీ వంగర వెంకట సుబ్బయ్య గారి గురించి పాత తరం సినిమా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. మాయాబజార్ చిత్రంలో అల్లు రామలింగయ్య గారితో పాటు కౌరవుల తరపు పురోహితలుగా నటించిన వీరు పండించిన హాస్యం ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉంటుంది. శర్మా ఇదికూడా భ్రమేనంటావా '....!  వంగర వెంకట సుబ్బయ్య తెలుగు సినిమా, నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు.  ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న కోటయ్య, వెర్రెమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకు న్నారు.ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.

Post a Comment

0 Comments

Close Menu