Ad Code

వాయిస్​తో మనీ ట్రాన్స్​ఫర్​ !

 


డిజిటల్​ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ​ పేమెంట్​ సంస్థ గూగుల్ పే మరో కొత్త ఫీచర్​ను​ ప్రకటించింది.' గూగుల్ ఫర్ ఇండియా 2021' విజన్‌లో భాగంగా ఈరోజు దీన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం యూపీఐ నంబర్​ ఎంటర్​ చేసి సెండ్​ కొడితే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమైపోతున్నాయి. అయితే ఇప్పుడు మరింత అడ్వాన్స్​డ్​గా వాయిస్​ బేస్డ్​ మనీ ట్రాన్స్​ఫర్​ ఆప్షన్​పై గూగుల్​ పే పనిచేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా వాయిస్​ కమాండ్​ ఇస్తే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమవుతాయి. ఈ వాయిస్​ కమాండ్ ఇంగ్లిష్​, హిందీ రెండు భాషలకు మద్దతిస్తుంది. అందుకే దీనికి 'హింగ్లీష్' అనే పేరు పెట్టింది. ఈ ఫీచర్​ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు భాషలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు వంటి భాషల్లోనూ ఈ ఫీచర్ ​అందుబాటులోకి రానుంది. వాయిస్ ఇన్‌పుట్‌తో డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేసేందుకు "స్పీచ్ టు టెక్స్ట్" అనే ఫీచర్​ను గూగుల్ జోడించనుంది. ఈ ఫీచర్​ ద్వారా యాప్‌ను మరింత స్మార్ట్‌గా మార్చాలని కంపెనీ భావిస్తోంది.  త్వరలోనే ఈ స్పీచ్​ టూ టెక్స్ట్ ఫీచర్​ను గూగుల్​ యూజర్లందరికీ పరిచయం చేయనుంది. వాయిస్​ ఇన్​పుట్ ద్వారా మనకు కావాల్సిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు సులభంగా ట్రాన్స్​ఫర్​ చేసుకునే అవకాశాన్ని గూగుల్ పే కల్పిస్తోంది. అకౌంట్​ నంబర్​ను హిందీ లేదా ఇంగ్లీష్​లో చెప్పవచ్చు. అనంతరం సెండర్​ కన్ఫర్మేషన్​తో పేమెంట్​ పూర్తవుతుంది. మరోవైపు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గూగుల్​ పే 'మై షాప్​' ఫీచర్‌ని కూడా జోడిస్తుంది. గూగుల్​పే యాప్​లో వారి వ్యాపారాలకు సంబంధించిన ఫోటోలు, వివరణలు, ధరలను నిమిషాల్లో జోడించి.. ఆ లింక్​ను బిజినెస్​ ప్రొఫైల్​ ద్వారా సోషల్​ మీడియాల్లో షేర్​ చేయవచ్చు. దీని ద్వారా చిరు వ్యాపారుల బిజినెస్​ మరింత అభివృద్ధి చెందుతుందని గూగుల్ పేర్కొంది. మని కొన్ని రోజుల్లోనే ఈ ఫీచర్​ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్​ పేని ఉపయోగిస్తున్నారు. గూగుల్​ పేలో వ్యాపారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో కొత్తగా లాంచ్​ అవుతోన్న మై షాప్​ ఫీచర్​ చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక, డిజిటల్​ ఇండియా ప్రోగ్రామ్​ కోసం గూగుల్​ 10 బిలియన్​ డాలర్లు వెచ్చించనుంది.

Post a Comment

0 Comments

Close Menu