Ad Code

గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకపోవడం మేలు!

 

గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకపోవడం మేలు!

బొప్పాయిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంతేకాదు పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా తీయగా, వైబ్రెంట్ కలర్లోఉంటుంది. దీన్ని చాలా మంది సలాడ్ రూపంలో తీసుకుంటారు. బొప్పాయిలో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. దీన్ని తరచూ ఉదయాన్నే, లేదా లంచ్ టైమ్ లో తింటే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కేన్సర్, బీపీని తగ్గిస్తుంది. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, కొంత మంది ఈ ఫ్రూట్ తినకపోవడమే మేలు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం మంచిది. కానీ, బొప్పాయిని ఆ జాబితాలో నుంచి తీసివేయడమే మేలు. ఎందుకంటే ఈ పండులో లేటెక్స్, ఉంటుంది. దీంతో యూరినరీ సమస్యలు వస్తాయి. ఇందులో పాపైన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రసవాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు. ఇది పిండానికి కవచంలో ఉండే పొరను బలహీనపరుస్తుంది. సగం పండిన బొప్పాయితో ఇది ఎక్కువగా జరుగుతుంది.  గుండె సంబంధిత రోగులకు మేలు చేస్తుంది. కానీ, ఇప్పటికే హార్ట్ బీట్ సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలో తక్కువ మొత్తంలో గ్లైకోసైడ్స్, మానవ జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్ ను ఉత్పత్తి చేసే అమినో యాసిడ్ ఉందని ఒక అధ్యయనం సూచిస్తుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ క్రమరహిత గుండె స్పందన సమస్యతో బాధపడేవారిలో దాని కంటే ఎక్కువ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులపై కూడా ఇదే ప్రభావం కలిగి ఉంటుంది. లేటెక్స్ అలర్జీ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఈ పండులో చిటినాసెస్ అనే ఎంజైమ్ లేటెక్స్ కలిగి ఉన్న ఆహారం మధ్య పరస్సర చర్యకు కారణమవుతుంది. ఇది తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దగ్గు, కళ్లలో నీరు కారడానికి దారితీస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu