Ad Code

అయ్యలసోమయాజుల లలిత

 

భారతదేశపు మొదటి మహిళా ఇంజనీర్.

లలిత గారు  నాటి మద్రాసు నగరంలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమెకు 15 ఏట పెళ్లి అయ్యింది. ఆమె  శ్యామల అనే ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ తర్వాత నాలుగు నెలలకే భర్త చనిపోయాడు. ఆమె తండ్రి అయిన పప్పు సుబ్బా రావు గారు ఆమె ఉన్నత విద్యను పూర్తి చేయడానికి సహకరించి,  ఆయన ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గూయిండిలో  ఇంజినీరింగ్ చదవాలనే లలిత గారి కోరికకు మద్దతు ఇచ్చారు.CEGలో, లలిత గారు  ఇతర మహిళా ఇంజనీర్లు అయిన P.K.థ్రెస్సియా మరియు లీలమ్మ కోషీ లతో కలసి చదువుకున్నారు. ఆమె కూతురు శ్యామల గారు  చెప్పినట్లుగా, లలిత గారికి  కళాశాలలో పరిపాలన మరియు ఇతర విద్యార్థులు మద్దతు ఇచ్చారు. "ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి విరుద్ధంగా, అమ్మ కళాశాలలోని  విద్యార్థులు చాలా మద్దతుగా ఇచ్చారు. వందలాది  అబ్బాయిలు ఉన్న కాలేజీలో ఆమె ఒక్కతే అమ్మాయి. కానీ ఎవరూ ఆమెకు అసౌకర్యం కలిగించలేదు. ఇంకా  దీనికి మనం ఋణంపడి ఉండాలి. అధికారులు ఆమెకు ప్రత్యేక హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అమ్మ కాలేజీ చదువు పూర్తి చేస్తున్నప్పుడు నేను మా మావయ్యతో కలిసి ఉండేదాన్ని. ఆమె ప్రతి వారాంతంలో నా దగ్గరకు వచ్చేది''. లలిత గారు 1943లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలు అయ్యారు.  ఆమె భారతదేశపు మొదటి మహిళా ఇంజనీర్‌గా అవతరించారు . ఆమె జమాల్‌పూర్ రైల్వే వర్క్‌షాప్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో తన ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేశారు. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత, సిమ్లాలోని  ''సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్'' లో తన తండ్రికి పొగలేని ఓవెన్లు మరియు జెలెక్ట్రోమోనియం (ఎలక్ట్రికల్ సంగీత వాయిద్యం) పరిశోధనలో సహాయం చేసారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రికల్ కమీషనర్ కార్యాలయంలో  సాంకేతిక సహాయకురాలు కావడానికి ముందు ఈస్ట్ ఇండియన్ రైల్వేస్‌లోని ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఆమె ఒక సంవత్సరం పాటు  ప్రాక్టికల్ శిక్షణను పొందారు. దీని తరువాత, 1948లో, ఆమె  కలకత్తాలోని బ్రిటిష్ సంస్థ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో చేరారు.  భారతదేశంలో అతిపెద్ద డ్యామ్ అయిన  భాక్రా నంగల్ డ్యామ్ కు సంబంధించిన ట్రాన్స్‌మిషన్ లైన్లు మరియు సబ్‌స్టేషన్ లేఅవుట్‌ల రూపకల్పనలో పనిచేశారు. ఆమె 1977లో పదవీ విరమణ చేయడానికి ముందు దాదాపు ముప్పై సంవత్సరాలు AEI (తరువాత జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ స్వాధీనం చేసుకుంది)లో పనిచేశారు. 1953లో ''కౌన్సిల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆఫ్ లండన్'' ఆమెను అసోసియేట్ మెంబర్‌గా ఎన్నుకుంది. 1966లో పూర్తి సభ్యురాలిగా పదోన్నతి కల్పించింది. 1964లో న్యూయార్క్‌లో జరిగిన ''మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్స్ మరియు సైంటిస్ట్  సదస్సు''కు (ICWES) హాజరైన ఏకైక భారత మహిళ ఇంజనీర్ 'అయ్యల సోమయాజుల లలిత''. 1965లో బ్రిటీష్ ఉమెన్స్ ఇంజినీరింగ్ సొసైటీ సభ్యురాలిగా లలిత గారు ఎన్నికయ్యారు . అలాగే  జూలై 1967లో కేంబ్రిడ్జ్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ మహిళా ఇంజనీర్స్ మరియు సైంటిస్ట్ (ICWES)కి ఆర్గనైజింగ్ కమిటీల భారతదేశ ప్రతినిధిగా పనిచేశారు.  ఐదుగురు భారతీయ మహిళ  ఇంజినీర్లు ఆ సదస్సుకి  హాజరు అయ్యేల చేసారు.. లలిత గారు తన  60 ఏట మెదడు సంబంధిత వ్యాధితో  మరణించారు.

Post a Comment

0 Comments

Close Menu