పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌
Your Responsive Ads code (Google Ads)

పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌

 

తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు స్పష్టంచేశారు. ప్రమాదం సమయంలో రైలులో 2348 మంది ఉన్నారని, ఏ ఒక్కరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ కున్నూర్ నుంచి బెంగళూరుకి వెళుతుండగా తెల్లవారుజామున 3.50 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. 5 బోగీలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడడంతో ట్రైన్ పట్టాలు తప్పింది. ఐదు భోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. రైలు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog