Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, November 3, 2021

తెరచుకున్న అయ్యప్ప స్వామి ఆలయం


కేరళలోని పథనంథిట్ట జిల్లాలోని దట్టమైన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, కేరళ దేవస్థానం బోర్డు అధికారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అయ్యప్పస్వామి ఆలయం తలుపులను తెరిచారు. స్వామివారి దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు. రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. ఆ తరువాత హరివరాసనం పూజలతో ఆలయ తలుపులను మూసివేస్తారు. చితిర అట్టావిశేష పూజల కోసం శబరిగిరీషుడి ఆలయం తలుపులు కొద్దిసేపటి కిందటే తెరచుకున్నాయి. వర్చువల్ క్యూ బుకింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు అనుమతిని ఇస్తున్నారు. స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు కొన్ని నిబంధనలను రూపొందించారు. భక్తులు తప్పనిసరిగా వాటిని అనుసరించాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించని వారికి స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు. అయ్యప్పుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా వాటిని పాటించాల్సి ఉంటుంది. దర్శనం చేసుకోవాల్సిన సమయం నుంచి 72 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అక్కడి సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. లేదా- రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్‌ను ఇవ్వాలి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు.. ఇక ప్రత్యేకించి- ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలను చూపించాలి. వ్యాక్సిన్ వేసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అందజేయాలి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా ఈ కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అందజేయాలి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు అధికారులు.

No comments:

Post a Comment

Popular Posts