Ad Code

కాంతారావు


కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించారు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించారు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు". కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.

Post a Comment

0 Comments

Close Menu