టీ-శాట్ ద్వారా మరింత ప్రజోపయోగ, సమాచార కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సాఫ్ట్ నెట్, టీ.శాట్ కార్యక్రమాలపై బుధవారం బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన వర్కింగ్ బాడీ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి బీ.ఆర్. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కె. సీతారామా రావు, ఎంసిఆర్ హెచ్ఆర్ డి. డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్,తెలంగాణా టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండి వెంకటేశ్వర్ రావు,సాఫ్ట్ నెట్ సీఈఓ శైలేష్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.
0 Comments