Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, November 3, 2021

పి.జి.కృష్ణవేణి


జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. నవంబరు 3, 1937న చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో  జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు. 2004 ఆగస్టు 16న మరణించారు. 

No comments:

Post a Comment

Popular Posts