Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, November 11, 2021

వరుడు పరార్....!


అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన ఓ యువకుడికి కర్నూలు జిల్లాకు చెందిన యువతితో కుదిరింది. నిశ్చితార్ధం అనంతరం నవంబర్ 10న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు పెద్దలు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెండ్లికి ఒప్పుకున్న వరుడు.. తీరా పెండ్లి రోజు ఏం ఆలోచించాడో కానీ,.. బుధవారం ఉదయం 10 గంటలకు పెండ్లి పెట్టుకుని, 8 గంటలకే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చెప్పులు మార్చుకొస్తానని చెప్పి అటు నుంచి అటే పరారీ అయ్యాడు. దీంతో పెండ్లి ఆగిపోయింది. వధువు, ఆమె కుటుంబీకుల ఆందోళన మేరకు గాలింపు చేపట్టి.. ఎట్టకేలకు వరుడిని ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇష్టం లేని పెండ్లి వద్దంటూ మొండి పట్టు పట్టడంతో పంచాయితీ పెద్దలు వివాహం రద్దు చేశారు. పీటల మీద పెండ్లి ఆగిపోవడంతో తమ కూతరు భవిష్యత్తు ఏంటని బాధిత తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

No comments:

Post a Comment

Popular Posts