Ad Code

గంగవ్వ నూతన గృహ ప్రవేశం

  


యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న గంగవ్వ ఎన్నో వీడియోల ద్వారా విశేష మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ ఫాలోయింగ్ ద్వారా ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో అనారోగ్య కారణంగా కొన్ని వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చింది. తనకు ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదని ఒకానొక సందర్భంలో తెలియజేయడంతో ఆమె కోసం ఇంటిని నిర్మించే బాధ్యతను బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు. గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే గృహ ప్రవేశం చేయడంతో ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారాయి. ఎట్టకేలకు గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరడంతో చాలామంది గంగవ్వకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం బిగ్ బాస్ ద్వారా 11 లక్షల రూపాయలను గెలుచుకున్న గంగవ్వ ఆ తర్వాత నాగార్జున 7లక్షల సహాయం చేశారు. ఇక మిగిలిన మూడు లక్షల అప్పు చేసి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. గంగవ్వ నూతన గృహ ప్రవేశానికి  అఖిల్‌, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు.

Post a Comment

0 Comments

Close Menu