Header Ads Widget

ఇఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుముక్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అన్ని ఇఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము, పన్ను చెల్లించాలి. దీని గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ ఎస్ బి ఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్  పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు తెలిపింది. కొత్త మార్గదర్శకాలు డిసెంబర్ 1, 2021 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ కస్టమర్‌లు గమనించాలి. రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో జరిగే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఇఎంఐ) లావాదేవీలపై ఈ ప్రాసెసింగ్ రుసుమును విధిస్తున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. నవంబర్ 12, శుక్రవారం రోజు ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఈ-మెయిల్ ద్వారా ఎస్‌బిఐ నోటిఫికేషన్ పంపింది. ఇందులో ఇలా పేర్కొంది. "డియర్ కార్డ్ హోల్డర్స్, డిసెంబర్ 01, 2021 నుంచి మర్చంట్ అవుట్‌లెట్‌లు/వెబ్‌సైట్‌లు/యాప్‌లలో చేసే అన్ని ఇఎంఐ లావాదేవీలకు ప్రాసెసింగ్ ఫీజుగా 99+ వర్తిస్తాయి. మీ నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 

Post a Comment

0 Comments