Header Ads Widget

విశాఖపట్నంలో భారీగా బంగారం స్వాధీనం

 

కోల్‌కతా నుంచి విశాఖపట్నం వచ్చిన హౌరా, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికులు 3.98 కేజీల బంగారాన్ని ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణా చేస్తున్నాడు. దీనిపై ముందే సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు.. తనిఖీలు చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ సుమారు రూ. 1.91 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, బంగ్లాదేశ్ కేంద్రంగా బంగారాన్ని తీసుకువచ్చి కోల్‌కతాలో ఆభరణాల రూపంలోకి మార్చి.. అక్రమ రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం.. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై మరింత సమాచారం కోసం నిందితుడిని విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments