Ad Code

రియల్ రాజన్న భార్యకు ఇల్లు


'జై భీమ్'... వాస్తవంగా జరిగిన కథను తీసుకుని సినిమాగా తీశారు. ఓటీటీలో సినిమా విడుదలైనప్పటి నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. హీరో, దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవా లారెన్స్ ఓ అడుగు ముందుకు వేసి 'జై భీమ్' చిత్ర బృందాన్ని అభినందించడంతో పాటు రియల్ రాజన్న భార్యకు ఓ ఇల్లును బహుమతిగా ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు. తెలుగులో రాజన్నగా చూపించారు కదా! తమిళనాడులో రాజకన్ను అనే గిరిజన వ్యక్తి కథ అది. ఆయన భార్య పేరు పార్వతి అమ్మాళ్. ఆవిడ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఓ పూరి గుడిసెలో జీవితం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన చలించిపోయిన రాఘవా లారెన్స్, ఆమెకు ఇల్లు కట్టిస్తున్నట్టు చెప్పారు. తెలుగులో పార్వతిని సినతల్లిగా చూపించారు. నిజ జీవితంలో... పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైనా, న్యాయం కోసం పార్వతి పోరాడిన తీరు, పలువుర్ని కదిలించింది.

Post a Comment

0 Comments

Close Menu