Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, December 31, 2021

పాన్ కార్డ్ నిజమైనదా లేదా అని కనుగొనడం ఎలా?


గత కొన్నేళ్లుగా మోసం కేసులు పెరిగిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డ్ ఐడీలో క్యూఆర్ కోడ్‌లను జోడించడం ప్రారంభించబడింది. జూలై 2018 తర్వాత పాన్ కార్డ్‌ని కలిగి ఉన్నవారు QR కోడ్‌ను పొందుపరిచారు. పాన్ కార్డ్‌లో రూపొందించబడిన QR కోడ్ నకిలీ మరియు నిజమైన పాన్ కార్డ్ ని గుర్తిస్తుంది. దాని కోసం మీకు స్మార్ట్‌ఫోన్ మరియు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఒక యాప్ అవసరం ఉంటుంది. 10 అంకెల పాన్ కార్డ్ ద్వారా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవడం, ఆస్తిని కొనడం లేదా అమ్మడం, ఏదైనా వాహనం కొనడం లేదా అమ్మడం, ఐటీఆర్ ఫైల్ చేయడం, 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగలు కొనడం వంటి అనేక పనులను చేయవచ్చు. అయితే ఈరోజుల్లో అనేక నకిలీ పాన్ కార్డుల కేసులు తెరపైకి వస్తున్నాయి. పాన్ కార్డ్ అనేది ప్రత్యక్ష ప్రయోజనం లేని ప్రభుత్వ డాక్యుమెంట్. అయితే బ్యాంకింగ్ మరియు ఇతర ఆర్థిక విషయాలలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక లావాదేవీల నుండి బ్యాంకు అకౌంట్ తెరవడం వరకు పాన్ కార్డ్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఇది కాకుండా ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం వంటి అనేక ముఖ్యమైన పనుల కోసం పాన్ కార్డ్ ఉపయోగించబడుతుంది.ముందుగా ఆదాయపు పన్ను శాఖ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లాలి. ఇందులో కుడి వైపున ఉన్న 'మీ పాన్ వివరాలను ధృవీకరించండి' లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వినియోగదారులు పాన్ కార్డ్ వివరాలను పూరించాలి. మీకు పాన్ నంబర్, పాన్ కార్డ్ హోల్డర్ యొక్క పూర్తి పేరు, అతని పుట్టిన తేదీ మొదలైన సమాచారాన్ని పూరించిన తర్వాత మీరు పూరించిన సమాచారం మీ పాన్ కార్డ్‌తో సరిపోలుతుందా లేదా అనే మెసేజ్ పోర్టల్‌లో వస్తుంది. ఈ విధంగా మీరు పాన్ కార్డ్ యొక్క సమగ్రతను సులభంగా కనుగొనవచ్చు.

మీ హార్ట్ బీట్ రేట్ ఎంత?


కరోనా వైరస్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. హెల్త్ టిప్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకునే అలవాటు కూడా మొదలైంది. రెగ్యులర్‌గా బీపీ, షుగర్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్ బీట్ రేట్ అప్పుడప్పుడూ చెక్ చేస్తున్నారు. అయితే హార్ట్ రేట్ తెలుసుకోవడానికి పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్ లాంటివి అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ చాలు. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫిట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని హార్ట్ బీట్ రేట్ చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా సాయంతో రెసిపిరేటరీ, హార్ట్ బీట్ రేట్‌ను తెలుసుకునే ఫీచర్ గూగుల్ ఫిట్ యాప్‌లో ఉంది. రెసిపిరేటరీ, హార్ట్ బీట్ రేట్ పరిశీలించిన ప్రతీసారి వివరాలు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాలారోజుల క్రితమే రూపొందించింది గూగుల్. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు యాపిల్ వాచ్ అవసరం లేకుండానే హార్ట్ బీట్ రేట్ తెలుసుకోవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫిట్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు.ఆ తర్వాత గూగుల్ ఫిట్ యాప్ ఓపెన్ చేయండి. మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. ఆ తర్వాత హోమ్ స్క్రీన్ పైన Check your heart rate పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Start measurement పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాపైన మీ వేలిని కాసేపు ఉంచాలి. Detecting the pulse in your fingertip అనే మెసేజ్ కనిపిస్తుంది. 30 సెకండ్ల తర్వాత మెజర్‌మెంట్ పూర్తవుతుంది. మీ హార్ట్ రేట్ ఎంతో స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలా చెక్ చేసిన ప్రతీసారి రికార్డ్ మెయింటైన్ చేయాలనుకుంటే Save measurement క్లిక్ చేసి వివరాలు సేవ్ చేసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్ లాంటివి లేనప్పుడు హార్ట్ రేట్ తెలుసుకోవడానికి గూగుల్ ఫిట్ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం గూగుల్ ఫిట్ యాప్ ఉపయోగించుకోవచ్చు. 

యానిమేటెడ్‌ డూడుల్‌తో సెలబ్రేట్!


2021 సంవత్సరానికి అందరూ ఇవాళ వీడ్కోలు పలుకబోతున్నారు. ఈసందర్భంగా న్యూ ఇయర్ ఈవ్‌ను గూగుల్ సపరేట్‌గా యానిమేటెడ్‌ డూడుల్‌తో సెలబ్రేట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ ఈవ్ పేరుతో తయారు చేసిన డూడుల్‌ను సెర్చ్ ఇంజిన్‌లోకి వెళ్లి క్లిక్ చేయగానే న్యూ ఇయర్స్ ఈవ్ పేరుతో మరో పేజీ ఓపెన్ అవుతుంది. న్యూ ఇయర్ ఈవ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వెబ్‌సైట్లను చూపించడంతో పాటు.. రంగు రంగుల కాగితాలను పై నుంచి కిందికి వెళ్లేలా రూపొందించింది. హ్యాపీ న్యూఇయర్ ఈవ్.. 2021కి వీడ్కోలు అంటూ డూడుల్‌కు క్యాప్షన్ పెట్టింది గూగుల్. గత రెండేళ్ల నుంచి కొత్త సంవత్సరం వేడుకలు అనుకున్నంతగా జరగడం లేదు. దానికి కారణం కరోనా మహమ్మారి. ఈసారి కూడా కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలపై మన దేశంతో సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి.


భాష ఏదైనా జవాబు ఇవ్వవచ్చు !



మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ 2021 ముగుస్తున్న తరుణంలో కొత్త ఫీచర్‌ను తీసుకోచ్చింది. యాప్‌లోని మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేయడం, వచ్చిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు చదవలేని భాషలలో పంపిన సందేశాల కోసం అనువాదం ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి వ్యక్తిగత చాట్‌లో ఎమోజీలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. గ్రూప్‌లు, ఛానెల్‌లలో, అడ్మిన్‌లు రియాక్షన్‌లను ఆన్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. టెలిగ్రామ్ చాట్‌లను మరింత సులభంగా చేయడానికి వాట్సాప్, సిగ్నల్ వంటి వాటితో పోటీ పడేందుకు దాని యాప్‌లో స్పాయిలర్ టెక్స్ట్ ఫార్మాటింగ్‌ను తెచ్చింది. వినియోగదారులు తమ సందేశాలలోని నిర్దిష్ట వివరాలు దాచడానికి ఇది ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్‌కు సపొర్ట్ ఇచ్చే అన్ని ఆండ్రాయిడ్ పరికరాలలో అనువాద ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ iOS వినియోగదారులు ఈ సేవను ఉపయోగించుకోవాలంటే iOS 15కి అప్‌డేట్ అవ్వాలి. టెలిగ్రామ్ ఇప్పటికే QR కోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. కొత్త ఫీచర్ ద్వారా పబ్లిక్ యూజర్‌నేమ్ ఉన్న ఏ యూజర్ కోసం అయినా రూపొందించబడే QR కోడ్‌కు సపోర్ట్‌గా వస్తుంది. విభిన్న రంగులతో QR కోడ్‌ను గ్రూప్‌లు, చానెల్‌ల కోసం రూపొందించవచ్చు. వీటిని ఇతర యాప్‌లతో షేర్ చేయవచ్చు లేదా ప్రింట్ చేసి ఇమెయిల్ చేయవచ్చు.


ఆకట్టుకుంటోన్నవాట్సాప్‌ న్యూ ఇయర్‌ స్టిక్కర్స్‌


2021కి వీడ్కోలు చెప్పడానికి ప్రపంచమంతా సిద్ధమవుతోంది. తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ న్యూఇయర్‌ విషెస్‌ చెప్పుకుంటుంటారు. ఇలా రకరకాల మెసేజ్‌లను తమ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు పంపిస్తూ కొత్తేడాదికి ఆహ్వానం పలుకుతుంటారు.మారుతోన్న కాలానికి అనుగుణంగా విషెస్‌ను కూడా కొత్తగా చెబితే చాలా బాగుటుంది కదూ.. మీలాంటి వారి కోసమే ప్రముఖ మెసేసింగ్ యాప్‌ వాట్సాప్‌ స్టిక్కర్ల రూపంలో విషెస్‌ చెప్పే అవకాశాన్ని తీసుకొచ్చింది. 2022 ఏడాదికి గాను తాజాగా కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్టిక్కర్స్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.?  ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌లో స్టిక్కర్‌ ప్యాక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్లేస్టోర్‌లోకి వెళ్లి న్యూఇయర్‌ స్టిక్కర్స్‌ అని సెర్చ్‌ చేయాలి. అనంతరం వచ్చిన వాటిలో ఒక స్టిక్కర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. స్టిక్కర్స్‌ ప్యాక్‌ను మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత మీరు ఎవరికైతే మెసేజ్‌ పంపించాలనుకుంటున్నారో వారి చాట్‌ బాక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎమోజీ బట్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం కుడివైపు ఉండే స్టిక్కర్స్‌ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న స్టిక్కర్‌ అక్కడ కనిపిస్తాయి. మీకు నచ్చిన స్టిక్కర్‌ను సెలక్ట్‌ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఆప్షన్‌ ఐఫోన్‌ యూజర్లకు మాత్రం అందుబాటులో లేదు. ఐ స్టోర్‌లో ఇలాంటి స్టిక్కర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలు లేదు. వీరు ఇతర థార్డ్‌ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆండ్రాయిడ్‌ యూజర్ల నుంచి స్టిక్కర్లను పంపించుకొని వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేసుకునే అవకాశం మాత్రం ఉంది.

Thursday, December 30, 2021

ఒక రూపాయి ప్లాన్ ఆపేసిన జియో


జియో ఇటీవల ఒక రూపాయి ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులను ఆహ్లాదపరిచే లక్ష్యంతో ప్రారంభించింది. ముఖ్యంగా ఈ ఒక రూపాయి ప్లాన్ నిరాడంబరమైన ఆఫర్లను మాత్రమే అందించింది. అంటే ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు 100 MB హై స్పీడ్ డేటా మరియు 30 రోజుల చెల్లుబాటు మాత్రమే అందించబడుతుంది. మరియు ఈ ఒక రూపాయి ప్లాన్‌ను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే, దాని ప్రయోజనాలు తగ్గించబడ్డాయి. అంటే ఈ ప్రాజెక్ట్‌లో 10 మాత్రమే పొందుపరిచారు. అయితే ఇప్పుడు జియో ఒక రూపాయి ప్లాన్ రద్దు చేయబడింది. అయినప్పటికీ, ఈ ప్లాన్ తక్కువ ధరకు వచ్చింది మరియు వినియోగదారులలో బాగా ఆదరణ పొందింది. అయితే, ఈ 1 రూపాయి ప్లాన్ అధికారిక వెబ్‌సైట్ మరియు జియో మొబైల్ ప్రాసెసర్ నుండి తొలగించబడింది. మరియు జియో యొక్క రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు రోజుకు 1.5GB డేటా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు. అదనంగా ఇది అపరిమిత వాయిస్ కాల్, 300 SMS ప్రయోజనం, JioTV, JioCinema, JioSecurity మరియు JioCloudకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సహా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

వాట్సప్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి!


బ్యాంకింగ్ యాప్ వాడుతున్నవారు యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూడాలి. సింపుల్‌గా బ్యాలెన్స్ చెక్ చేయడానికి వాట్సప్ చాలు. వాట్సప్‌లోనే బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్  చెక్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీరు వాట్సప్ పే సర్వీస్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ పే రిజిస్టర్ చేస్తే మీ యూపీఐ అకౌంట్ వాట్సప్‌లో యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత కేవలం కొన్ని సెకండ్లలో కొన్ని క్లిక్స్‌తో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. వాట్సప్ పే సర్వీస్ ఇండియాలో 2018లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో కలిసి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే, ఫోన్‌పే లాగానే వాట్సప్ కూడా యూపీఐ సర్వీసెస్ అందిస్తోంది. అయితే వాట్సప్ ఛాటింగ్ యాప్‌లోనే యూపీఐ సేవల్ని పొందొచ్చు. వాట్సప్‌లో రెండు పద్ధతుల్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.  మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి,  పేమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి  View Account Balance ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఆపై స్క్రీన్ పైన మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇంకో పద్దతి : వాట్సప్ యాప్‌లో పేమెంట్ నోటిఫికేషన్ స్క్రీన్‌లో పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత View Account Balance ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వేర్వేరు అకౌంట్స్ వాట్సప్ పేలో రిజిస్టర్ చేసినట్టైతే ఏ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. స్క్రీన్ పైన మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. వాట్సప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకునే పద్ధతి గూగుల్ పే, ఫోన్‌పే, ఇతర యాప్స్‌లో ఉన్నట్టుగానే ఉంటుంది. దాదాపు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయి ఇతర యూపీఐ యాప్స్‌లో కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే వాట్సప్ ప్రతీ రోజూ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఇతర యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

పేలిన రియల్‌మి XT !


ఇటీవల స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రియల్ మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాధిత యూజర్  ఫిర్యాదు చేయడంతో వైరల్ అయింది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనపై స్పందించింది. వారం క్రితమే బాధితుడు రియల్‌మి XT స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయగా.. కొద్దిగంటలకే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై స్పందించిన కంపెనీ బాధితుడి అడ్రస్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. స్మార్ట్ ఫోన్ అధిక ఒత్తిడి కారణంగానే పేలిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్విట్టర్ యూజర్ పేలిన రియల్ మి ఫోన్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. వాస్తవానికి ఆ ఫోన్ తన స్నేహితుడికి చెందినదిగా తెలిపాడు. మంగళవారం సాయంత్రం ఫోన్ కొనుగోలు చేసిన కొన్ని గంటలకే పేలినట్టు వెల్లడించాడు. ట్విట్టర్ లో పేలిన ఫోన్ ఫొటోలను పోస్టు చేసిన అతడు.. రియల్ మి వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ ను ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. పేలుడు ఘటనపై వెంటనే స్పందించిన రియల్‌మి ఇండియా ట్విట్టర్ అధికారిక సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది.

యూజర్లు ఇక సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలసిందే!


చాలామందికి బోర్‌ కొడితేనో, కాస్త తీరిక సమయం దొరికితేనో మొదట చేసే పని యూట్యూబ్‌ ఓపెన్‌ చేయడం. మనకిష్టమైన వీడియోలను కావాల్సినంతసేపూ చూసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాలకు సంబంధించిన టీజర్లు, పాటలు, ట్రైలర్లు యూట్యూబ్‌లోనే విడుదలవుతుంటాయి. సాధారణంగా మనం వీడియోలను వీక్షించడమే కానీ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అయితే డేటా స్పీడ్‌లో సమస్యలున్నప్పుడు, ఇతర కారణాలతో కొంతమంది వాటిని ఆఫ్‌లైన్‌ మోడ్‌లో వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. తీరికదొరికినప్పుడు వాటిని చూస్తుంటారు. ఇందులో ఉన్న ప్రయోజనాలేంటంటే ఇలా ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోలకు ఇంటర్నెట్‌ తో సంబంధం లేదు. ప్రకటనలు కూడా ఉండవు. పైగా ఎన్నిసార్లయినా వీటిని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి యూట్యూబ్‌ షాకిచ్చింది. సాధారణంగా లో, మీడియం, హై, ఫుల్‌ హెచ్‌డీ ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియోలైనా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం.. హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే ప్రతి నెలా సబ్‌స్ర్కిప్షన్‌ డబ్బులు కట్టాలన్నమాట. యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యముంది. అయితే యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పోస్ట్‌ చేస్తున్నారు. కాగా యూట్యూబ్‌ లో ఇప్పటికే యాడ్ ఫ్రీ గా వీడియోలు చూడాలంటే నెల నెలా సబ్‌స్క్రిప్షన్‌  తీసుకోవాలని నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కుటుంబ సమేతంగా ప్రయాణించాలంటే ....!


భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ఉమ్మడి కుటుంబం కల్చర్ కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లిల్లు, ఫంక్షన్లు, తీర్థయాత్రలు ఎక్కడకు వెళ్లినా కుటుంబ సమేతంగానే వెళ్లడం భారతీయులకు అలవాటు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే, పెద్ద కార్లను ఆటో రంగంలోని అన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో టాటా సుమో, టొయోటా క్వాలిస్ లాంటి వాహనాలకు చాలా డిమాండ్ నడిచింది. ఇప్పుడు అదే బాటలో మరిన్ని వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.  మహీంద్రా బొలేరే ఇది 7 సీట్ల SUV, 1493 cc డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది డీజిల్ SUV , 1 లీటర్ డీజిల్‌ తో 16.7 కి.మీల మైలేజీ లభిస్తుంది. కానీ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.72 లక్షలు. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన 7 సీట్ల కారు ఇది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్‌లలో వస్తుంది. దీని మైలేజీ విషయానికి వస్తే లీటరుకు 17-20 కిలోమీటర్లు వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.96 లక్షలు ఎక్స్-షోరూమ్. రెనాల్ట్ ట్రైబర్‌లో 999 సీసీ పెట్రోల్ ఇంజన్ తో కూడిన ఈ కారులో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు మాన్యువల్ , ఆటోమేటిక్ వేరియంట్‌లతో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.53 లక్షలు ఎక్స్-షోరూమ్. గతంలో మారుతి ఓమిని వ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ఈ కారు, ప్రస్తుతం ఈకో పేరుతో మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు CNG , పెట్రోల్ వేరియంట్ తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4.38 లక్షలు ఎక్స్-షోరూమ్. దీనికి 1196 సిసి ఇంజన్ పవర్ తోడుకాగా. ఇది ఒక కిలో గ్యాస్‌లో 20 కి.మీ వరకు వెళ్లగలదు. అలాగే ఒక లీటరు పెట్రోలుకు 20 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ కారు 5 , 7 సీటర్ రెండు వేరియంట్లలో వస్తుంది.

Wednesday, December 29, 2021

'ప్రైవసీ' చిక్కుల్లో సుందర్‌ పిచాయ్‌ ?

 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త చిక్కుల్లో పడ్డారు. యూజర్ల ప్రైవసీ విషయంలో గూగుల్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ పిచాయ్ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ బ్రౌజింగ్ విషయంలో ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. యూజర్ల ప్రైవసీపరంగా గూగుల్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఒకరు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. Incognito బ్రౌజింగ్ మోడ్ ద్వారా Alphabet .Inc యూజర్ల ఇంటర్నెట్ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా గూగుల్ ట్రాక్ చేసినట్లు ఆరోపిస్తూ.. జూన్ 2020లోనే దావా దాఖలైంది. ఇప్పుడు దానిపై విచారించిన కోర్టు.. సుందర్ పిచాయ్‌ను యూజర్ల ప్రైవసీ విషయంలో రెండు గంటల పాటు ప్రశ్నించాలని తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి పిచాయ్‌ని కోర్టు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్లు ప్రైవేట్ మోడ్‌ వినియోగించినప్పుడు.. యూజర్లకు తెలియకుండా ఇంటర్నెట్ వినియోగాన్ని గూగుల్ ట్రాక్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గూగుల్‌ సీఈవో సుందర్‌కు ముందుగానే తెలుసునని కోర్టులో వాదించారు. ప్రైవేట్‌ మోడ్‌లో యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించేలా గూగుల్ వ్యవహరించిందని సదరు వ్యక్తి ఆరోపించారు. ఈ ఆరోపణలపై గూగుల్ స్పందించింది. సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రైవసీ ఆరోపణలపై గూగుల్ సమాధానం ఇచ్చిందని అన్నారు. గూగుల్‌ క్రోమ్‌ Incognito బ్రౌజింగ్‌ కు సంబంధించి 2019లోనే పిచాయ్‌ యూజర్లను హెచ్చరించారు. Incognito Mode సమస్యాత్మకమైనదిగా తెలిపారు. Incognito Mode అనేది కేవలం యూజర్ల డేటాను సేవ్‌ చేయకుండా మాత్రమే అడ్డుకోగలదని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆన్‌లైన్‌లోనే గడిపేస్తుంటారు. క్షణం తీరిక లేకుండా ఏదేదో ఇంటర్నెట్లో వెతికేస్తుంటారు. వందలాది సైట్లను తెగ చూసేస్తుంటారు. ఆన్ లైన్లో మనం ఏం సెర్చ్ చేస్తున్నామో ఎవరికి తెలియదనుకోవడం పొరపాటే.. మీరు సెర్చ్ చేసే ప్రతిదీ గూగుల్ కంట పడుతునే ఉంటుంది. కొంతమంది Incognito మోడ్ ద్వారా విజిట్ ఇస్తే.. ఎవరూ ట్రాక్ చేయలేరని భ్రమ పడుతుంటారు. వాస్తవానికి ఇంటర్నెట్లో యూజర్ల ప్రైవసీకి కచ్చితమైన భద్రత లేదనే చెప్పాలి. ఎంతగా భద్రత కల్పించినప్పటికీ కూడా ఏదో ఒక లూప్ హోల్ ద్వారా యూజర్ల ప్రైవసీ డేటా బహిర్గతమవుతోనే ఉంటోంది. ఇప్పుడు ఇలాంటి సమస్యనే గూగుల్ ఎదుర్కొంటోంది. యూజర్ల ప్రైవసీకి సంబంధించి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రైవసీ ఉల్లంఘన విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ను కాలిఫోర్నియా కోర్టు ప్రశ్నించనుంది.

రూ. 1999కే ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్...!


ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్‌లు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈవీ ఎక్స్‌పో 2021లో ఫాస్ట్ అనే హై-స్పీడ్ ఈ-స్కూటర్ ను పరిచయం చేసింది ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ కొత్త స్కూటర్ ధర రూ.90,000.  దీనిని రూ.1,999తో బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకాయ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మరియు డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఒకాయ ఫాస్ట్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 kWh లిథియం-ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌తో పని చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 150 కి.మీ ప్రయాణిస్తుందని సంస్థ చెబుతుంది. జాగ్రత్తగా వాడితే ఒక్క సారి ఛార్జి చేస్తే 200 కి.మీ ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి LED లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 60-70 కి.మీ. ఒకాయ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫెర్రాటోను రాబోయే రోజుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2022లో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇ-మోటార్‌సైకిల్ 2 kW మోటార్ మరియు 3 kW బ్యాటరీతో వస్తుంది. దీనిని గంటకు 90 కిమీ వేగంతో నడపవచ్చు.ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 100 కి.మీ ప్రయాణిస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా అవతరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టార్టప్ 6 నెలల్లో దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లను సృష్టించడం విశేషం.

వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్!

ప్రతి ఒక్కరు తమ సహోద్యోగులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సంప్రదిస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా ఒకరితో ఒకరు సులభంగా సమన్వయం చేసుకోడానికి సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'కమ్యూనిటీలు' అని పిలవబడే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అడ్మిన్‌లు ఎక్కువ వాట్సాప్ గ్రూపులను లింక్ చేయడానికి, వాటిని పెద్ద కమ్యూనిటీ గ్రూప్‌లో ఉంచడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఇతరులతో సంప్రదింపులు వేగంగా జరపవచ్చు. వాట్సాప్ కమ్యూనిటీలు, 10 అడ్మిన్ వాట్సాప్ గ్రూప్‌లను ఒకే కమ్యూనిటీకి లింక్ చేయడానికి అనుమతిస్తాయి. ఈ ఫీచర్ వాట్సాప్ మేనేజర్ బీటా కొత్త అప్‌డేట్ 2.22.1.1 ద్వారా ఐఓఎస్ బీటా బిల్డ్‌లో విడుదల చేసింది. గ్రూప్ అడ్మిన్‌లు వాట్సాప్‌లోని ఇతర గ్రూపులపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు. వాట్సాప్ కమ్యూనిటీ అడ్మిన్, గ్రూప్ అడ్మిన్ కంటే ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. ఉదాహరణకు, కార్యాలయంలో వేర్వేరు విభాగాల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు ఉంటాయి. హెచ్ఆర్ హెడ్ లేదా సిఇఓ అన్ని గ్రూప్‌లను ఒకదానికొకటి లింక్ చేయడానికి WhatsApp కమ్యూనిటీని సృష్టించవచ్చు. కమ్యూనిటీ ద్వారా HR హెడ్ లేదా CEO, లింక్ చేయబడిన అన్ని గ్రూప్‌లపై నియంత్రణ కలిగి ఉంటారు. కమ్యూనిటీ ఫీచర్ ప్రస్తుతం గ్రూప్ చాట్ లాగానే కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది. కొత్త కమ్యూనిటీ ఫీచర్ టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోటీ పడవచ్చు.


ఒకరినొకరు చంపుకొని తినడం ఖాయం ?


భూమిని వదిలి మరొక గ్రహంపై నివాసం ఏర్పరుచుకోవాలని చూస్తున్న మనుషులకు శాస్త్రవేత్తలు విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఆకలికి తాళ్లలేక ఒకరినొకరు చంపుకు తినటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్స్, జూపిటర్ వంటి గ్రహాలపై, కాలనీలు ఏర్పాటు చేసుకోవాలన్న మనుషుల కలలపై.. శాస్త్రవేత్తల తాజా నివేదికలు నీళ్లుచల్లాయి. metro.co.uk పత్రిక కధనం ప్రకారం.. సమీప భవిష్యత్తులో మనుషులు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం, అయితే అది అనుకున్నంత తేలిక కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల జరిపిన అంతరిక్ష పరిశోధనల్లో.. జూపిటర్ చందమామ, క్యాలిస్టో.., శని గ్రహ చందమామ టైటాన్ పైనా మనుషులు జీవించేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు తేల్చారు. ఇక సంవత్సరాల వ్యవధిలోనే.. క్యాలిస్టో, టైటాన్ లపై మనుషులు కాలనీలు ఏర్పాటు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఆహారం సరఫరా. భూమి నుంచి సుదూర ప్రాంతంలో ఉన్న ఆయా గ్రహాలపై పంట పండించే అవకాశం లేదు. ఏదైనా వ్యాధులు సంక్రమించినా చికిత్సలు ఉండవు. ఈ రెండు గ్రహాలకు భూమి నుంచి సహాయం అందించాలంటే ఏళ్ళకేళ్ళకు సమయం పడుతుంది. దీంతో ఆకలికి తట్టుకోలేక మనుషులు ఒకరినొకరు చంపుకుతినే అవకాశం ఉందని బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ కు చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కాకెల్ వెల్లడించారు. అందుకు ఉదాహరణగా, కెప్టెన్‌ సర్‌ జాన్‌ ఫ్రాంక్లిన్‌ 19వ శతాబ్దంలో చేపట్టిన ” నార్త్-వెస్ట్ ప్యాసేజ్‌”ను వివరించారు. సర్ జాన్ ఫ్రాంక్లిన్ 19వ శతాబ్దంలో ఒక భారీ నౌకను వేసుకుని భూమిపై ఉత్తర ధృవాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. అయితే కొన్ని రోజులకు దారి తప్పి..మంచు ఖండంలో చిక్కుకుపోయారు. రోజులు గడుస్తుండగా.. ఉన్న ఆహార నిల్వలు అయిపోయి.. నౌకలోని వారు ఒకరినొకరు చంపుకు తిన్నారు. ఇక గ్రహాలపైకి వెళ్లే మనుషుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని ప్రొఫెసర్ చార్లెస్ కాకెల్ హెచ్చరించారు. అయితే మార్స్ గ్రహంపై ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని.. భూమికి దగ్గరగా ఉన్నందున.. మార్స్ గ్రహంపైకి త్వరగానే చేరుకుని పరిస్థితిని కొంత చక్కబెట్టుకునే అవకాశం ఉంటుందని చార్లెస్ కాకెల్ వెల్లడించారు. కాబట్టి క్యాలిస్టో, టైటాన్ ల కన్నా ముందు మనుషులు మార్స్ గ్రహంపైకి చేరుకోవాలని కాకెల్ అభిప్రాయపడ్డారు. అయితే దీనికి పరిష్కార మార్గంగా కాకెల్ పలు సూచనలు చేసారు. క్యాలిస్టో, టైటాన్ గ్రహాలపైకి వెళ్లే ముందు సాంకేతికతను ఉపయోగించి ఆయా గ్రహాలపై వాతావరణాన్ని విశ్లేషించాలని సూచిస్తున్నారు. అక్కడ పంటలు పండేలా అనువైన వాతావరణం సృష్టించాలని, అప్పుడు కూడా నేరుగా మనుషులు వెళ్లకుండా గడ్డితినే జంతువులను పంపించి పరీక్షించాలని కాకెల్ సూచించారు. తద్వారా జంతువులను రక్షించినట్లు ఉంటుంది.. మనుషులకు ఏకాంత భావన తప్పుతుందని అతని అభిప్రాయం. డాక్టర్ కేమెరూన్ స్మిత్ అనే శాస్త్రవేత్త తెలిపిన వివరాలు ప్రకారం.. మనుషులు ఆత్రంగా గ్రహాలపై నివాసాలు ఏర్పరుచుకుంటే.. ఆకలికి తట్టుకోవడం అసాధ్యమని, దంతో వారు ఒకరినొకరు చంపుకు తినడం ఖాయమని స్మిత్ పేర్కొన్నారు. మనుషులు వెళ్లడం కన్నా, ఆయా గ్రహాలపై ముందుగా వ్యవసాయం చేస్తే బాగుంటుందని స్మిత్ అభిప్రాయపడ్డారు. 

200 అకౌంట్లు డిలీట్ చేసిన ఫేస్‌బుక్


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాదాపు 200 అకౌంట్లను డిలీట్ చేసింది. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి చెందిన గ్రూపులను ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాం నుంచి రిమూవ్ చేసింది. నల్ల జాతీయులను ఆందోళనల్లో పాల్గొని విద్వేశాలను రెచ్చగొట్టేలా గ్రూపులు ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు కలిగిన ప్రౌడ్ బోయ్స్, అమెరికన్ గార్డుకు సంబంధించిన రెండు హేట్ గ్రూపులను ఇదివరకే ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. మిన్నెపాలీస్‌లో జార్జ్ ప్లాయిడ్ మృతి ఘటనపై కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి పోస్టులను ఆయా అకౌంట్ల తొలగింపుపై ఇదివరకే మానిటరింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ గ్రూపుల్లో ర్యాలీ మద్దతుదారులు, సభ్యులను ఆందోళనలో పాల్గొనే ప్రేరేపించేలా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఆయుధాలతో కూడా నిరసనల్లో పాల్గొనాలని విద్వేశపూరితంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని గుర్తించినట్టు ఫేస్ బుక్ కౌంటర్ టెర్రరిజం, డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీ డైరెక్టర్ బ్రెయిన్ ఫిష్ మ్యాన్ తెలిపారు. తొలగించిన అకౌంట్ యూజర్ల వివరాలను బహిర్గతం చేసేందుకు కంపెనీ నిరాకరించింది. మొత్తం మీద 190 అకౌంట్లను తొలగించినట్టు ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఫేస్ బుక్ ఆరంభించినప్పటి నుంచి కొత్త అప్ డేట్ లతో యూజర్లకు దగ్గరవుతూనే ఉన్నాడు. 17మిలియన్ డాలర్లు (రూ.127కోట్లు)తో హవాయిలో స్థలం కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టనున్నారట!. ఇంతపెద్ద స్థలాన్ని వ్యాపారి కొనుగోలు చేయడమంటే అందరూ ఏదో పెద్ద ప్రాజెక్ట్ గురించే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ, ఇదంతా వ్యవసాయం కోసమే అని చెప్తున్నారు జూకర్ బర్గ్ భార్య. 100ఏళ్ల నాటి కా లోకో రిజర్వాయర్ 2016లో ధ్వంసమైంది. వరదల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం మెటా సీఈఓ 1500ఎకరాలు కొనుగోలుచేశారు. అందులో పూర్తిగా వ్యవసాయం చేయాలనే అనుకుంటున్నారు. అంతేకాకుండా అటవీ జీవితాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారని అతని భార్య ప్రిస్కిల్లా చాన్ వెల్లడించారు. ఆ స్థలంలోనే విశాలవంతమైన ఇల్లు కట్టుకుని ఉంటారట!. 35వేల 888 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపడతారు. దీని విలువ దాదాపు 35మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా.

Tuesday, December 28, 2021

1 నుంచి ఆర్ బి ఐ కొత్త రూల్స్


బ్యాంకు అకౌంట్ దారులకు అలర్ట్.. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలో నగదు విత్‌డ్రాపై కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. గతంలో ఏటీఎంల్లో నుంచి నగదు ఉపసంహరణకు చెల్లించిన మొత్తం కంటే అధిక మొత్తంలో బ్యాంకు అకౌంట్ దారులు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీ విత్ డ్రా లిమిట్ దాటిన వెంటనే ఈ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్‌లకు పెరిగిన ఛార్జీల నోటిఫికేషన్‌లను పంపిస్తున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఈ కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయని,  ఏటీఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత పరిమితిని మించి రూ. 20+ ట్యాక్స్ నుంచి రూ. 21+ ట్యాక్స్ కు సవరించింది. ఇప్పటికే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో నోటీసును ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్  ఏటీఎం లలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలపై రూ. 21 + GST వర్తించనుందని యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉచిత నెలవారీ పరిమితి దాటిన తర్వాత నగదు, నగదు రహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులకు అనుమతించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. కస్టమర్‌లు నగదును ఉపసంహరించుకోవడానికి గతంలో చెల్లించిన దానికంటే రూ. 1 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1, 2022 నుంచి కస్టమర్‌లు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే.. ప్రతి లావాదేవీకి రూ. 20కి బదులుగా రూ. 21 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు అధిక ఇంటర్‌చేంజ్ చార్జీలను అందించేందుకు ఖర్చుల సాధారణ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ప్రతి లావాదేవీపై కస్టమర్ నుంచి ఛార్జీలను రూ. 21కి పెంచేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఈ కొత్త చార్జీలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటనలో వెల్లడించింది. డెబిట్ కార్డ్‌లను కలిగిన అన్ని బ్యాంక్ కస్టమర్‌లు నెలకు వారి అకౌంట్ బ్రాంచ్ ఏ టి ఎం లలో ఉచితంగా 5 వరకు లావాదేవీలకు అనుమతి ఉంటుంది. అందులో నగదు లేదా నగదు రహిత లావాదేవీలు చేసుకునేందుకు అర్హులుగా ఆర్బీఐ పేర్కొంది. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల నుంచి 3 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఉచిత నెలవారీ పరిమితులకు మించి నగదు, నగదు రహిత ఏ టి ఎం లపై ఛార్జీలను పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్  బ్యాంకులను అనుమతించింది.

మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టేసుకునే స్కూటర్


జపాన్ అంటే టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఎప్పుడు ఏదోక కొత్తది కనిపెట్టే జపాన్ సరికొత్త స్కూటర్ ని ఆవిష్కరించింది. ఓ చిన్న స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ఎంత విచిత్రమైనదంటే..దీన్ని మడతపెట్టేసి బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. జపాన్ కు చెందిన టొక్యో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇన్‌ప్లాటబుల్ స్కూటర్‌ను ఆవిష్కరించారు.దీనికి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పోమోలో సాధారణ బైకుల తయారీలో వినియోగంచే మెటల్ కాకుడా థెర్మోప్లాస్టిక్ రబ్బర్‌తో బైక్ బాడీని తరయారు చేశారు. దీంతో బైక్ బరువు కూడా తగ్గిపోతుంది. దీన్ని మడతపెట్టేసుకోవచ్చు. దాని తగిన సౌకర్యమే ఈ స్కూటర్ లో ప్రత్యేకత. గాలిమిషన్‌తో గాలికొడితే రెండు నిమిషాల్లో బైక్ బాడీలోకి గాలి వెళ్లి స్కూటర్ రెడీ అయిపోతుంది. సాధారణంగా బైకులకు రెండే చక్రాలుంటాయి. కానీ ఈ స్కూటర్ కు నాలుగు చక్రాలుంటాయి. దీంట్లో మోటార్ కమ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బైక్ కంట్రోల్స్ అన్ని బైక్ హ్యాండిల్ దగ్గరే ఉంటాయి. ఈ బైక్ లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయండోయ్..మన అవసరాలను బట్టి బైక్‌ను డిజైన్లలో మార్పులు చేసుకోవచ్చు. 5.5 కేజీల బరువుండే ఈ బైక్‌ను మడతపెట్టి బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవచ్చు. ఈ పోమో బైక్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే గంటకు 15 కిమీ వేగంతో 90 నిమిషాలపాటు ప్రయాణిచొచ్చు. గరిష్టంగా 20 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. చిన్నచిన్న అవసరాల కోసం ఈ పోమో బైక్ ఉపయోగపడుతుందంటున్నారు టోక్యో శాస్త్రవేత్తలు.

2022లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ?


టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఓఎస్ అయిన ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ చాలా డివైజ్‌లకు రాకముందే, కొత్త టెక్నాలజీపై గూగుల్ దృష్టి సారించింది. తాజాగా ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం XDA డెవలపర్స్ షేర్ చేసింది. వీటిలో ఆండ్రాయిడ్ 13లో రానున్న లేటెస్ట్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. నోటిఫికేషన్స్ రిక్వెస్ట్, లాంగ్వేజ్ కంట్రోల్స్, సరికొత్త బ్లూటూత్ టెక్నాలజీ సపోర్ట్ వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేసి, లాంచ్ చేయగానే.. కెమెరా, మైక్, లొకేషన్, స్టోరేజ్, కాంటాక్ట్‌లు, ఫోన్, క్యాలెండర్‌ను యాక్సెస్ చేయడానికి యూజర్ల రిక్వెస్ట్ కోరతాయి. అయితే ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌లో కొత్తగా నోటిఫికేషన్స్ సెండ్ చేసేందుకు కూడా కస్టమర్లను యాప్స్ రిక్వెస్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 12 వరకు వచ్చిన ఓఎస్‌లలో యాప్స్‌ కస్టమర్ల అనుమతి లేకుండా నేరుగా నోటిఫికేషన్స్ సెండ్ చేసేవి. ఆ తరువాత అవి అవసరం లేదనుకుంటే యూజర్లు బ్లాక్ చేసుకునేవారు. ఆండ్రాయిడ్ 13 'టిరామిసు' అనే ఇంటర్నల్ కోడ్ నేమ్‌తో రానుంది. మే 2022 నాటికి గూగుల్ దీని గురించి ప్రకటించి, సెప్టెంబర్ 2022 నాటికి స్టాండర్డ్స్ బిల్డ్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే లీక్ అయిన ఫీచర్లను డెవలపర్లు టెస్టింగ్ చేసి, భవిష్యత్తు అవసరాల ప్రకారం మార్చుకునే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఓఎస్ అందుబాటులోకి వచ్చేనాటికి, ఇందులో ప్రస్తుత ఫీచర్లు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం

13 నగరాలలో మొదట 5G !


టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ 5G నెట్‌వర్క్‌లు మరింత సర్వసాధారణం కాబోతున్నాయి. 2022 సంవత్సరంలో భారతదేశంలో వాణిజ్య 5G నెట్‌వర్క్‌ను మొదటిసారిగా అందుబాటులోకి రానున్నది. నెట్‌వర్క్ రోల్‌అవుట్ ఖర్చుల కారణంగా టెల్కోలు భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో 5Gని ప్రారంభించలేవు. కేవలం టన్నుల కొద్దీ సాధారణ వినియోగదారులు మాత్రమే కాకుండా ముందుగా బ్రేక్-ఈవెన్ పాయింట్‌కి చేరుకోవడంలో సహాయపడే ఎంటర్‌ప్రైజెస్ మరియు బహుళజాతి కంపెనీలు ఉన్న నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. 5G ట్రయల్స్ జరుగుతున్న చాలా నగరాలు 2022లో ఖచ్చితంగా 5G నెట్‌వర్క్‌లను అందుకుంటాయి. కోల్‌కతా, బెంగళూరు, గురుగ్రామ్, పూణే, గాంధీనగర్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, లక్నో, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్ మరియు జామ్‌నగర్ నగరాలలో 5G నెట్‌వర్క్‌లు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. జియో, ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇప్పటికే ఈ నగరాల్లో తమ 5G ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ మెట్రో మరియు పెద్ద నగరాలు ముందుగా ప్రత్యక్ష వాణిజ్య 5G నెట్‌వర్క్‌లను అందుకుంటాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం ధృవీకరించింది.

సోలార్ పవర్ ఉత్పత్తిలో ఐఐటీ గుహాటీ ముందడుగు !


పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్న భారత్ లో, సోలార్ పవర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధ్యమైనంత వరకు పలు ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుండగా, అవి ఖర్చు ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఖర్చు తగ్గించి విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేలా అనేక దేశాల పరిశోధకులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మనదేశంలోని “ఐఐటీ – గుహాటీ”లో జరిపిన పలు పరిశోధనలు, సోలార్ పవర్ ఉత్పత్తిలో కీలకంగా మారనున్నాయి. సోలార్ పవర్ ఉత్పత్తికి సంబంధించి ముఖ్యమైన పరికరం “సోలార్ ప్యానల్”. సిలికాన్ ఆధారిత ఫోటో వోల్టాయిక్ సెల్ గా పిలువబడే సాంకేతికతను దశబ్దాలుగా సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. అయితే ఈతరహా పరికరాలతో ఖర్చు ఎక్కువగానూ, ఉత్పత్తి తక్కువగాను ఉంటుంది. అంతేకాక, పరిమాణాన్ని బట్టి, ఈ సోలార్ ప్యానెళ్ల నిర్వహణ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యామ్న్యాయాలు లేకపోవడంతో విద్యుత్ సంస్థలు ఏళ్లకేళ్లుగా ఈ ఫోటో వోల్టాయిక్ సెల్” నిర్మాణం కలిగిన ప్యానెళ్లనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం “ఐఐటీ – గుహాటీ”లో జరిపిన పరిశోధనలు మున్ముందు సౌరశక్తిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న పీవీసీ స్థానంలో “పెరోవ్‌స్కైట్-నిర్మాణం” అనే సాంకేతికతను అమర్చి పరిశోధకులు పరీక్షలు జరిపారు. ఈ “పెరోవ్‌స్కైట్-నిర్మాణం” సూర్యరశ్మిని 21శాతం అదనంగా విద్యుత్ పరివర్తనం చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ “పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్ ” సాధారణంగా హైబ్రిడ్ ఆర్గానిక్-అకర్బన సీసం లేదా టిన్ హాలైడ్-ఆధారిత పదార్థాల సమ్మేళనంగా ఉంటుంది. దీంతో ఇది అధిక వేడిని, బాహ్య వాతావరణాన్ని తట్టుకోలేకపోతుంది. అయితే “పెరోవ్‌స్కైట్ సెల్” తయారీలో వాడిన పదార్ధాలు ఖర్చు తక్కువగాను, సామర్ధ్యం ఎక్కువగాను ఉందంటూ ఈ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించిన ఐఐటీ – గుహాటీ ప్రొఫెసర్ పరమేశ్వర్ ఐయ్యర్ పేర్కొన్నారు. వేడి, ఇతర వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా “పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్ (”ను మరింత అభివృద్ధి చేస్తే ఎక్కువ మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమేనని ప్రొఫెసర్ పరమేశ్వర్ పేర్కొన్నారు.

“హీరో లేక్ట్రో” నుంచి బ్లూటూత్ తో సైకిల్


ద్విచక్ర వాహన దిగ్గజం హీరో సంస్థ తన సైకిల్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా, విద్యుత్ తో నడిచే సైకిల్ ను హీరో సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. విద్యుత్ స్కూటర్లు, వాహనాలను తయారు చేస్తున్న హీరో సంస్థ తన అనుబంధ సంస్థయిన “హీరో లేక్ట్రో” నుంచి F2i, F3i అనే రెండు ఈ-సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. లైఫ్ స్టైల్ కోవలోకి వచ్చే ఈ రెండు సైకిళ్ళల్లో, బ్లూటూత్ సహా మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్లూటూత్ ఫీచర్స్ F2i, F3i సైకిల్స్ ప్రత్యేకత. దీంతో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లో సంస్థ అందించే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని బ్లుటూత్ ద్వారా సైకిల్ ను అనుసంధానించవచ్చు. అందులో నమోదు అయ్యే వివరాల ప్రకారం వినియోగదారులు ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయి, జిపిఎస్ మ్యాప్ వంటి విషయాలు గమనించవచ్చు. 6.4Ah బ్యాటరీ సామర్ధ్యంతో వస్తున్న ఈ రెండు సైకిల్స్ 250W BLDC మోటార్ కలిగి ఉంటాయి. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27-35 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ అయిపోతే తొక్కుకుంటూ తిరిగి రావొచ్చు. 7 స్పీడ్ గేర్స్, 100ఎంఎం సస్పెన్షన్, 27.5 అంగుళాలు(వెనుక), 29 అంగుళాలు(ముందు) టైర్లు, ముందువెనుక డిస్క్ బ్రేక్ వంటి అధునాతన ఫీచర్స్ F2i, F3i సైకిల్స్ లో ఉన్నాయి. ప్రధానంగా నగరాల్లోని యువతను, వారాంతాల్లో పర్యటనలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని విడుదల చేసిన ఈ సైకిల్ ధరలు F2i- ₹39,999, F3i- ₹40,999గా ఉన్నాయి.

Monday, December 27, 2021

లెనోవో నుండి సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌

చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Lenovo Legion Y90. ప్రత్యేకంగా గేమింగ్‌ కోసం ఈ ఫోన్ తయారు చేశారు. గేమింగ్స్ ఆడేవారికి నిజమైన గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి భారీ డిస్‌ప్లేను అమర్చారు. డిజైన్ పరంగా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. గేమింగ్స్ ఆడాలనుకునేవారికి ఈ ఫోన్ సరి కొత్త అనుభవాన్ని అందించనుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 20-30 నిమిషాల గేమింగ్ తర్వాత కూడా ఫోన్ హీట్ కాకుండా.. నార్మల్‌గానే ఉంటుందని కంపెనీ తెలిపింది. Lenovo Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ 6.92-అంగుళాల E4 AMOLED HD స్క్రీన్‌తో, 144Hz రిఫ్రెష్ రేట్, 720Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్-ఇంజన్ ఎయిర్-కూల్డ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 888పై పనిచేసే అవకాశం ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ కాకుండా ఉండడానికి 120fps కి సపోర్ట్‌గా వస్తుంది. నిరంతరాయంగా గేమ్స్ ఆడుకోవడానికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ త్వరలో ప్రకటించనుంది.


ఐఓఎస్​ డివైజ్‌లలోనూ గూగుల్​ ఫిట్


కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ పెరిగింది. ఎప్పటికప్పుడు మన గుండె, శ్వాసకోశ రేటును మానిటర్​ చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో హెల్త్​ మానిటరింగ్​ డివైజెస్​కు గణనీయమైన ఆదరణ పెరిగింది. దీంతో సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​ తన పిక్సెల్​ డివైజ్‌లో హృదయ స్పందన రేటుతో  పాటు శ్వాసకోశ రేటును  ట్రాక్​ చేసే ఫీచర్​ను విడుదల చేసింది. గూగుల్​ ఫిట్ ఫీచర్‌తో డివైజ్‌లోని కెమెరా సెన్సార్లను ఉపయోగించి హెల్త్ మానిటర్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీచర్​ ఇప్పటివరకు ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఐఓఎస్​ డివైజెస్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఐఓఎస్​లో రన్ అయ్యే డివైజెస్​తో కూడా ఇప్పుడు హార్ట్, రెస్పిరేటరీ రేటును చెక్​ చేసుకోవచ్చు. గూగుల్​ ఫిట్ హోమ్ ఫీడ్‌లో "Check your heart rate", "Track your respiratory rate" అనే రెండు ఆప్షన్లను కొత్తగా జోడించింది. స్మార్ట్​ఫోన్​లో యాక్టివ్​ ఇంటర్నెట్​ కనెక్షన్​ లేనప్పుడు కూడా ఈ ఫీచర్​ పని చేస్తుంది. వినియోగదారులు వారి డివైజ్​ వెనుక కెమెరా సెన్సార్​పై తమ బ్రొటన వేలు పెట్టి గట్టిగా ప్రెస్​ చేస్తే.. హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు. కేవలం 30 సెకన్లలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఫలితాలు డిస్‌ప్లే దిగువన పీబీఎం ప్రివ్యూ గ్రాఫ్‌ రూపంలో చూసుకోవచ్చు.ఈ టెస్టింగ్ పూర్తయిన తర్వాత గూగుల్​ ఫిట్​లో మీ హెల్త్​ మానిటరింగ్​ హిస్టరీని సేవ్ చేయాలా వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. మరోవైపు, మీ ముందు కెమెరాతో మీరు ఒక నిమిషంలో తీసుకునే శ్వాసల సంఖ్యను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే, మీరు ఫోటో తీసుకునే సమయంలో మీ తల, ఎగువ మొండెం కదపకుండా స్పష్టంగా తీయండి. అప్పుడే కచ్చితత్వంతో కూడిన ఫలితం వస్తుంది.

టెక్నో బ్రాండ్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్


టెక్నో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇండియాలో తన యొక్క మొదటి ఫోన్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్‌ప్లే మరియు పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. అంతే కాకుండా దీని యొక్క డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు అందిస్తూ బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్ ధరలో లభించడం హైలైట్. Tecno Pova 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.95-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ 5G ఫోన్ మీడియాటెక్ Dimensity 900 SoCతో పాటు 8GB వరకు LPDDR5 RAM మరియు 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా HiOSలో రన్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ 3GB వరకు వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. వినియోగదారులకు అదనపు సెక్యూరిటీను అందించడానికి కంపెనీ స్మార్ట్‌ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తుంది.

గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ బైక్స్


రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350:ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్ సెర్చ్‌లో వెతికిన టాప్ 10 బైక్స్ లో “రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ -350” మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో గూగుల్‌లో ప్రతి నెల 8 లక్షల సార్లు సెర్చ్ చేశారట.

యమహా ఎమ్‌టి-15 : 2021లో గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన రెండో బైక్ యమహా ఎమ్‌టి-15. ఈ బైక్ ను ప్రతి నెల 5.5 లక్షల సార్లు సెర్చ్ చేసారు.

కేటీఎమ్ ఆర్‌సీ 200: దేశీయ మార్కెట్లో ఎక్కువమంది బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్స్ లో ఇది ముందువరుసలో నిలిచింది.కేటీఎమ్ కంపెనీ ఆర్‌సి 200 బైక్ 2021లో అత్యధికంగా శోధించిన బైకుల జాబితాలో టాప్ 10 లో మూడో బైక్ గా నిలిచింది. ఈ బైక్ గూగుల్‌లో ప్రతి నెలా 4.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు నెటిజన్స్.

బజాజ్ పల్సర్ 125 :బజాజ్ ఆటో సంస్థకు చెందిన బజాజ్ పల్సర్ 125 బైక్ గూగుల్‌లో ఎక్కువగా వెతికిన బైక్స్ లో ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. బజాజ్ పల్సర్ 125 బైక్ ను ప్రజలు గూగుల్‌లో 3.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు.

యమహా ఆర్15 : ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో వెతికిన టాప్ టెన్ బైకులతో జాబితాలో యమహా ఆర్-15కు ఐదోస్థానం దక్కింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ : మార్కెట్లో అత్యంతగా ఆదరణపొందిన టూవీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కు చెందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఆరో స్థానంలో నిలిచింది.

కేటీఎమ్ ఆర్‌సీ390 : కేటీఎమ్ ఆర్సీ 390 బైక్ ను గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా సర్చ్ చేశారు. ఇది ఏడో స్థానంలో ఉన్నది.

సుజుకి హయబుసా : నివేదిక ప్రకారం ఈ బైక్ ను ప్రతి నెల దాదాపు 3 లక్షల సార్లు సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సుజుకి మోటార్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ బైక్ “సుజికి హయబుసా” కు 2021లో గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కింది. ఇది దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న కాస్ట్లీ బైక్ కూడా. ఈ బైక్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ : ఇది అత్యంతగా అమ్ముడైన ఉత్తమ బైక్ గా నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన వెహికల్ గా, ముందువరుసలో స్థానం సంపాదించగలిగింది. ఈ ఏడాది అత్యధికంగా శోధించిన టాప్ టెన్ బైక్స్ జాబితాలో దీనికి తొమ్మిదో స్థానం దక్కింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 : 2021 సంవత్సరంలో టాప్ టెన్ లిస్ట్ లో” రాయల్ ఎన్‌ఫీల్డ్ “కు చెందిన బైక్స్ మూడు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350ను ఎక్కువగా యూత్ కోరుకున్నారు. గూగుల్ లో వెతికిన టాప్ టెన్ జాబితాలో ఈ బైక్ పదో స్థానంలో నిలిచింది.


జనవరి 6న షియోమి 11ఐ హైపర్‌చార్జ్ విడుదల !

భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న షియోమి 11ఐ హైపర్‌చార్జ్ జనవరి 6న లాంఛ్ కానుంది. లాంఛ్‌కు ముందు టీజర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ను షియోమి వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో చైనాలో ప్రవేశపెట్టిన రెడ్‌మి నోట్ 11 ప్రొ+ రీబ్రాండెడ్ వెర్షన్‌గా షియోమి 11ఐ హైపర్‌చార్జ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 920 చిప్‌సెట్‌తో 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ కేవలం 15 నిమిషాల్లో చార్జింగ్ పూర్తవుతుంది. భారత్‌లో ఇదే అత్యంత వేగవంతమైన చార్జింగ్ డివైజ్ అని షియోమి చెబుతోంది. షియోమి 11ఐ హైపర్‌చార్జ్ పసిఫిక్ పెర్ల్‌, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. షియోమి 11ఐ హైపర్‌చార్జ్ 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్‌, 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఎఫ్‌హెచ్‌డీ+ 6.67 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్‌తో రానున్న ఈ స్మార్ట్‌పోన్ ధర రూ 22,000 నుంచి రూ 26,000 మధ్య అందుబాటులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మంచి బ్యాటరీ బ్యాకప్ తో ఒప్పో ఎ11ఎస్

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి బడ్జెట్ సిగ్మంట్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 5000mAh బ్యాటరీ బ్యాకప్ తో ఒప్పో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒప్పో ఎ11ఎస్ సిరీస్.. 6.5 అంగుళాల HD LCDతో 90Hz రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 460తో రన్ అవుతుంది. 18W ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. కెమెరా 13MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ షూటర్ పంచ్ హోల్ కటౌట్ అమర్చారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఫోన్ సైజు 163.9 x 75.1 x 8.4 mm ఉండగా, బరువు 188 గ్రాములు ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలలో వచ్చింది. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో ఒప్పో ColorOS 7.2తో వచ్చింది.

Sunday, December 26, 2021

విశ్వం పుట్టుక తెలుస్తుందా ?


అనంత విశ్వంలోని రహస్యాలను తెలుసుకునేందుకు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది సక్సెస్‌ అయితే విశ్వం పుట్టుకతో పాటు ఏలియన్స్‌ జాడ కూడా తెలిసే అవకాశముందని అంటోంది నాసా. విశ్వం రహస్యాలను తెలుసుకునేందుకు మనిషి.. ఎన్నో ఉపగ్రహాలు పంపించాడు. రోబోటిక్ రోవర్లను ప్రయోగించాడు. టెలిస్కోప్‌లతో ఖగోళ రహస్యాలను శోధించాడు. ప్రపంచానికి సరికొత్త విషయాల్ని తెలియజేశాడు. ఇప్పుడా అన్వేషణలో జేమ్స్‌ వెబ్ టెలిస్కోప్‌తో మరో ముందడుగు వేసింది నాసా. బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల్ని శోధించేందుకు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ పనిచేయనుంది. హబుల్ టెలిస్కోప్ కంటే మరిన్ని సీక్రెట్స్ చెబుతుందా? అని సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో.. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అభివృద్ధి చేసింది నాసా. దాదాపు 20కి పైగా దేశాలు ఈ టెలిస్కోపు నిర్మాణంలో పని చేశాయ్‌. ఏరియన్‌ 5 స్పేస్‌ రాకెట్‌లో ఫ్రెంచ్‌ గినియాలోని గినియాస్పేస్‌ సెంటర్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపించారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు కష్టపడ్డారు.

2024లో షావోమీ నుంచి కార్లు..!


తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో వెలుగొందుతున్న టెక్ దిగ్గజం షావోమీ ఆ తర్వాత టీవీలు, ల్యాప్ టాప్ లు, ఆడియో ఉత్పత్తులు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, లైట్లు ఇలా ఎన్నింటినో తీసుకొచ్చింది.  ఇక కార్ల మార్కెట్లోనూ పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను సంస్థ సీఈవో లీజున్ ధ్రువీకరించారు. షావోమీ తన మొదటి కారును 2024లో విడుదల చేస్తుందని ప్రకటించారు. ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు షావోమీ ఈ ఏడాది మొదట్లో ఒక ప్రకటన చేసింది. కానీ, ఎప్పుడు తీసుకురానున్నదీ స్పష్టం చేయలేదు. తాజాగా సంస్థ సీఈవో ఈ విషయాన్ని బయటపెట్టారు. 10వేల మందికి పైగా నిపుణులు, ఇంజనీర్లు కార్ల అభివృద్ధి కోసం పని చేస్తున్నట్టు లీజున్ తెలిపారు. అయినా స్మార్ట్ ఫోన్లు తమ ప్రధాన వ్యాపారంగా ఇక మీదటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్ల ప్రాజెక్టుపై షావోమీ 10 బిలియన్ డాలర్లను (రూ.75వేల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. వార్షికంగా 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలన్నది సంస్థ ప్రణాళిక.

Saturday, December 25, 2021

పేటిఎం ప్రీపెయిడ్ రీఛార్జ్ లపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ !


భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ పేమెంట్స్ మరియు వాలెట్ అప్లికేషన్‌లలో ఒకటైన పేటిఎం దాని వినియోగదారులకు ముందు నుంచి కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్‌లను అందిస్తోంది. కంపెనీ మళ్లీ తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ , వోడాఫోన్ ఐడియా , రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్‌తో సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్‌ల నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పేటిఎం నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసేటప్పుడు వినియోగదారులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేడు. ఈ అప్లికేషన్‌ను మొదటిసారి ఉపయోగించే వినియోగదారులు తమ లావాదేవీపై తక్షణం రూ.15 తగ్గింపును పొందడానికి FLAT15 కోడ్‌ని ఉపయోగించవచ్చు. అలాగే ఈ కంపెనీ తన యొక్క వినియోగదారులకు అనేక ఇతర ఆఫర్‌లను కూడా అందిస్తుతుంది. వాటిలో ఒకటి వారి లావాదేవీపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవడం. రూ.1,000 గెలుచుకునే అవకాశాన్ని పొందడానికి వినియోగదారులు 'WIN1000' ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

రూ.91 రూపాయలకే 28 రోజుల అన్ లిమిటెడ్


రిలయన్స్ జియో కస్టమర్లు రూ.91 రూపాయలకే 28 రోజుల అన్ లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. వాస్తవానికి, టారిఫ్ ధరలను పెంచిన తరువాత, ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే ప్రయోజనాలలో మార్పులు జరిగాయి. చాలా ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా Jio తీసుకొచ్చిన 91 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందించే చవక ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 100MB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ మరియు 200 MB అదనపు డేటాను కూడా అఫర్ చేస్తుంది.ఇది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే. జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే మరిన్ని ప్లాన్స్ విషయానికి వస్తే, జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. ఈ ప్లాన్స్, 20% క్యాష్ బ్యాక్, డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి.

సరికొత్త రంగుల్లో సుజుకి స్కూటర్లు !


సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, తన స్కూటర్ల శ్రేణిలో ఉన్న రెండు వాహనాలకు సరికొత్త హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసింది. సుజుకి యాక్సిస్, సుజుకి బర్గ్ మాన్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి  తీసుకొచ్చింది. ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్న ఈ రెండు స్కూటర్లు సంస్థ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సుజుకి యాక్సిస్, సుజుకి బర్గ్ మాన్ రెండు వాహనాలు రెండు సరికొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. యాక్సిస్ స్కూటర్లోని బ్లూ టూత్ వేరియంట్… “గ్లాసి గ్రే” కలర్ లో లభిస్తుండగా, స్టాండర్డ్ వేరియంట్ “మెటాలిక్ డార్క్ గ్రీనిష్ బ్లూ” కలర్ లో లభ్యమౌతుంది. బర్గ్ మాన్ స్కూటర్లోని స్టాండర్డ్, బ్లూ టూత్ వేరియంట్లు రెండునూ “గ్లాసి గ్రే”కలర్ లోనే లభ్యం అవుతున్నాయి. ఈ రెండు స్కూటర్లు 125 సీసీ ఇంజిన్ కెపాసిటీతోనే వస్తున్న విషయం తెలిసిందే. ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులేమీ లేవు. బర్గ్ మాన్ 125 స్కూటర్ మాత్రం డ్యూయల్ టోన్ సీట్, ఫుట్ బోర్డుతో సరికొత్తగా వస్తుంది. ఇక ద్విచక్ర వాహన చట్టం సరికొత్త మార్గదర్శకాల ప్రకారం, “సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్” ఫీచర్ ను ఈ రెండు స్కూటర్లలో సరికొత్తగా అమర్చింది సుజుకి. 125 సీసీ ఇంజిన్ కలిగి ఉన్న ఈరెండు స్కూటర్లు 8.6 బీహెచ్పీ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవేకాక ప్రస్తుతం వస్తున్న హైటెక్ సొబగులన్నీ దాదాపు ఈరెండు స్కూటర్లలో ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా వస్తున్న ఈ స్కూటర్లు ఇండియాలో సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ...!

 


ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాల హావ కొనసాగుతూనే ఉన్నది. వీటి ధర కూడా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉన్నది. ఇక వీటి వారంతో పాటు గా పెట్రోల్ ధరలు కూడా అధికంగా పెరగడంతో సామాన్యులకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వీటితో పాటుగా వాయుకాలుష్యం ప్రతిరోజు కి పెరుగుతూనే ఉన్నది. అందుచేతనే ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలనే పెంచుకునేలా చేస్తూ ఉన్నారు. ఇక వీటి ద్వారా కూడా తక్కువ ధరలకే ఉండేలా చూస్తూ ఉన్నారు ఆయా సంస్థలు. ఇక అందుచేతనే సరి కొత్త కంపెనీలు కూడా తమ కంపెనీ నుంచి కొత్త బైక్ లను విడుదల చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం యువతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త డిజైన్లతో ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలో.. ఒకాయ ఎలక్ట్రిక్ సంస్థ కూడా ఒకటి. తమ ద్విచక్ర వాహనం లను హై స్పీడ్ తో కలిగే విధంగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. మార్కెట్లోకి "FAST" అనే పేరుతో వీటిని విడుదల చేయడం జరిగింది. ఇక వీటి ధర విషయానికి..90,000 రూపాయలని తెలియజేశారు. ఇక వీటి గురించి మొత్తం.. ఒకయ గ్రూప్ MD అనిల్ తెలియజేయడం జరిగింది. ఇక ద్విచక్ర వాహనం విషయానికి వస్తే..65-75 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఇక ఈ బైక్ కి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనిష్టంగా 140 నుంచి 200 కిలోమీటర్ల వరకు వెళుతుందట. ఇక ఈ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే..4.4 కిలో వాట్స్.. ఇక ఈ బ్యాటరీకి లిథియం పాస్పోట్ బ్యాటరీతో తయారుచేయబడింది. ఇక ఈ బైక్ ను కూడా రాబోయే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ బైక్ ను వెంటనే తీసుకోవాలంటే బుకింగ్ కొరకు 1999 రూపాయల తెలియజేయాలి అన్నట్లుగా సంస్థ తెలియజేసింది.

టెక్నో స్పార్క్ 8


బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సంస్థ “టెక్నో” తన “స్పార్క్ సిరీస్”లో మరో కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ లో ఇప్పటికే ఉన్న స్పార్క్ 8 ఫోన్ ను మరింత అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. టెక్నో ఫోన్ లు తక్కువ ధరలో, సరాసరి ఫీచర్స్ తో అందరికి అందుబాటులో ఉంటాయి. హై ఎండ్ ఫీచర్స్ తో ఒకవైపు ప్రీమియం ఫోన్ లు ఊరిస్తున్నా, దాదాపు అలాంటి ఫీచర్స్ నే అందిస్తూ మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు బడ్జెట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నో స్పార్క్ సిరీస్ ఫోన్లు.. సంస్థ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్ధ్యాన్ని 256జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే “టెక్నో” స్పార్క్ 8, 1612 x 720 HD+ రిజల్యూషన్, 6.56-అంగుళాల డాట్ నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే గరిష్టంగా 480 నిట్‌ల ప్రకాశం కలిగి ఉంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో వస్తున్న ఈఫోన్, ఏడాదికి పైగా అప్డేట్స్ అందుకుంటుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈఫోన్ టెక్నో సొంత ఇంటర్ఫేస్ HiOSతో రన్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో 16 మెగా పిక్సెల్ సామర్ధ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన జంట కెమెరాలు ఉండగా, ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. వెనుక కెమెరా AI పోర్ట్రెయిట్, AR ఫిల్టర్‌లు, టైమ్‌లాప్స్ వీడియోలు తీసుకోవచ్చు. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సియాన్ మరియు ఐరిస్ పర్పుల్ వంటి మూడు రంగులలో ఈ కొత్త “టెక్నో స్పార్క్ 8” స్మార్ట్ ఫోన్ లభించనుంది.


Friday, December 24, 2021

ఫోన్ రిలీజ్ కాకుండానే 2 లక్షల బుకింగ్స్‌... !

 

 కొన్ని ఫోన్లకు ఉన్న డిమాండ్ వేటికీ ఉండదు. ముఖ్యంగా ఐఫోన్స్‌. ఈ ఫోన్లు విడుదల అవ్వడమే ఆలస్యం.. హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. విడుదల అయిన రోజే లక్షల్లో సేల్స్ జరుగుతాయి. అంత డిమాండ్ ఉన్న బ్రాండ్స్‌లో యాపిల్ తర్వాత జియోమీ సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. చైనాకు చెందిన ఈ కంపెనీ.. ఎంఐ, రెడ్‌మీ పేరుతో ఇప్పటి వరకు అత్యాధునికమైన ఫీచర్లలో పలు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. త్వరలో జియోమీ నుంచి 12 సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా జియోమీ 12, జియోమీ 12 ప్రో ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల లాంచ్ కంటే ముందే.. ప్రీ ఆర్డర్స్ చేసుకునే అవకాశాన్ని జియోమీ కల్పించింది. దీంతో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఈ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్స్ వచ్చాయట!. పలు ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కోసం ముందే చాలామంది ప్రీ ఆర్డర్ చేసేశారట. ఈ ఫోన్లు కూడా అత్యాధునికమైన ఫీచర్లతో లాంచ్ కానున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం.. 2కే డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అలాగే.. గేమింగ్ కోసం ప్రత్యేకంగా హీట్ డిస్సిపేషన్ అనే ఫీచర్‌ను ఈ ఫోన్లలో తీసుకురానున్నారు.

టొయోటా నుంచి టూ-సీటర్ ఎలక్ట్రిక్ కార్


లక్ష రూపాయలకే  టాటా నానో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అంతకన్నా చిన్న కారును టొయోటా పరిచయం చేసింది. టొయోటా సీ+పాడ్ మోడల్‌ను జపాన్‌లో రిలీజ్ అయింది.  ఇద్దరు మాత్రమే ఈ కారులో ప్రయాణించొచ్చు. టొయోటా సీ+పాడ్ కార్‌ను 2020 డిసెంబర్‌లోనే జపాన్‌లోని మునిసిపల్ కస్టమర్ల కోసం పరిచయం చేసింది. ఇప్పుడు జపాన్‌లోని సాధారణ ప్రజలకు కూడా ఈ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కారులో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుండటంతో జపాన్ ప్రజల కోసం టొయోటా రిలీజ్ చేసిన టూ-సీటర్ సీ+పాడ్ కార్ ఆకట్టుకుంటోంది.  ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. టాటా నానో కారుతో పోలిస్తే టొయోటా సీ+పాడ్ కార్ చిన్నగా ఉంటుంది. టాటా నానో కారులో నలుగురు కూర్చోవచ్చు. కానీ టొయోటా సీ+పాడ్ కార్‌లో డ్రైవర్‌తో పాటు మరొకరు మాత్రమే కూర్చోవచ్చు. టొయోటా సీ+పాడ్ చిన్న కారే అయినా ఇద్దరూ కంఫర్ట్‌గా కూర్చోవడానికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది.  టొయోటా సీ+పాడ్ కారులో 9.06 kWh లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంది. ఫుల్లుగా రీఛార్జ్ చేసి 150 కిలోమీటర్లు తిరగొచ్చు. ను 200V/16A ఔట్‌లెట్ రీఛార్జ్ చేయడానికి ఐదు గంటలు సమయం పడుతుంది. సిటీలో తిరగాలనుకునే వారికి ఈ కార్ ఉపయోగపడుతుంది. ఈ కారులో ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి. ఈ కారు బరువు తగ్గించేందుకు ఎక్స్‌టీరియర్ ప్యానెల్స్‌ని ప్లాస్టిక్‌తో తయారు చేసింది కంపెనీ. టొయోటా సీ+పాడ్ కార్ అనేక కలర్స్‌లో లభిస్తుంది. రెండు గ్రేడ్లలో ఉంటుంది. టొయోటా సీ+పాడ్ 2,490 మిల్లీ మీటర్ల పొడవు, 1,290 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,550 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. జీ గ్రేడ్ వాహనం బరువు 690 కిలోలు. ఎక్స్ గ్రేడ్ వాహనం బరువు 670 కిలోలు.

గుజరాత్‌లో 5G ట్రయల్స్ ప్రారంభం


5G నెట్‌వర్క్ విషయంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. గుజరాత్‌లోని అజోల్ గ్రామంలో ఈ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో, గాంధీనగర్‌లోని ఉనావా పట్టణంలో బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్  ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్పీడ్‌ను అధికారులు లెక్కించారు. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు, రెండు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీతో కూడిన బృందం అజోల్ గ్రామానికి చేరుకుంది. ఈ టీమ్‌లో డీడీజిలు రోషమ్ లాల్ మీనా, అజాతశత్రు సోమాని, డైరెక్టర్లు వికాస్ దాధిక్, సుమిత్ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. వారితో పాటు నోకియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) టెక్నికల్ టీమ్స్ కూడా ఉన్నాయి. 5G ట్రయల్స్ సందర్భంగా పీక్ డౌన్‌లోడ్ స్పీడ్‌ 105.47Mbps, పీక్ అప్‌లోడ్ స్పీడ్‌ 58.77Mbpsగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ట్రయల్స్ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "5G BTS ఉన్న ఉనావా పట్టణానికి 17.1 కి.మీ దూరంలో ఉన్న అజోల్ గ్రామంలో 105 Mbps కంటే ఎక్కువ పీక్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను గమనించాం. ఇది రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ కోసం భారత్‌లో టెస్ట్ చేసిన మొట్టమొదటి 5G ఇన్నొవేషన్ సొల్యూషన్" అని ట్వీట్‌లో పేర్కొంది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్‌లతో కూడిన 5G ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 360 డిగ్రీస్ కెమెరాలు, వర్చువల్ రియాలిటీ కనెక్టెడ్ క్లాస్ రూమ్స్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ  కంటెంట్ ప్లేబ్యాక్ వంటి వాటిని ట్రయల్ సైట్‌లో టెస్ట్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అసిగ్మా యాప్‌ను రూపొందించిన ఇండియన్ ఆర్మీ

 


ప్రస్తుతం పరిచయం అక్కర్లేని యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాడే యాప్ ఇది. ఎవరికైనా మెసేజ్ పంపించాలన్నా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపించాలన్నా, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవాలన్నా.. రూపాయి ఖర్చు లేకుండా కేవలం నెట్ ఉంటే చాలు వాట్సప్ ద్వారా వీటన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు.. అంటే ఇండియాలో దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్సప్ వల్ల వచ్చే ఒకే ఒక పెద్ద సమస్య ప్రైవసీ. యూజర్ల డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది. వాళ్లు పంపించే డాక్యుమెంట్లు, చాట్‌, ఫోటోలు, వీడియోలు హ్యాకర్లకు దొరకకుండా ఉంటాయి అని అనుకునే చాన్స్ అయితే లేదు. ఎందుకంటే.. వాట్సప్ ప్రైవసీపై ఇప్పటికే చాలాసార్లు ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. అందుకే చాలామంది వాట్సప్‌కు ఆల్టర్నేట్ మెసేజింగ్ యాప్‌వైపు చూస్తున్నారు. ఇండియన్స్ వాట్సప్ తర్వాత ఎక్కువగా టెలిగ్రామ్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత సిగ్నల్ యాప్‌ను వాడుతారు. సాధారణ వ్యక్తులు ఏ యాప్ వాడినా పెద్దగా నష్టం ఉండదు కానీ ప్రభుత్వ సంస్థలు, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ ఇటువంటి యాప్స్ ఉపయోగించి.. ముఖ్యమైన సమాచారాన్ని వాట్సప్‌లో షేర్ చేస్తే ఇంకేమైనా ఉందా? అవి లీక్ అయితే ఎంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇండియన్ ఆర్మీ ఓ ఆలోచన చేసింది. ఆర్మీ కోసం సొంతంగా వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్‌ను తయారు చేసింది. దానికి ASIGMA (Army Secure IndiGeneous Messaging Application) అనే పేరు పెట్టింది. ఈ యాప్‌ను ఇండియన్ ఆర్మీలోకి ఆఫీసర్ల టీమ్ డెవలప్ చేసింది. ఇప్పటి వరకు ఆర్మీ.. Army Wide Area Network (AWAN) మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించేది. దీని ద్వారానే ఆర్మీ మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసేది. గత 15 ఏళ్ల నుంచి ఈ సర్వీస్‌ను ఆర్మీ వినియోగిస్తోంది. తాజాగా దీని ప్లేస్‌లో అసిగ్మా యాప్‌ను డెవలప్ చేసింది. ఆర్మీ ఇంటర్నల్ అవసరాల కోసం దీన్ని మరింత సెక్యూర్‌గా డెవలప్ చేశారు. వాట్సప్, సిగ్నల్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడకుండా ఉండేందుకే ఆర్మీ సొంతంగా ఈ యాప్‌ను డెవలప్ చేసుకుంది. ఈ యాప్‌లో గ్రూప్ చాట్స్‌, వీడియో, ఇమేజ్ షేరింగ్‌, వాయిస్ నోట్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ప్రైవేటు టెలికం ఆపరేటర్ ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు


ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా 77 రోజుల వ్యాలిడిటీతో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నాయి. రిలయన్స్ జియో కూడా రూ.666 ప్లాన్‌పై 84 రోజుల వ్యాలిడిటీతో అఫర్ చేస్తోంది. రెండు నెలల కాలపరిమితితో పాటు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కోరుకునే యూజర్లకు బాగుంటుంది. గతవారమే వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.700 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లలో వరుసగా రూ.155, రూ.239, రూ.666 ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్ని టెలికం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయని, అలాగే Vi వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5GB డెయిలీ డేటా, రోజుకు 100SMS పొందవచ్చు. Vi Movies, TV కంటెంట్ 77 రోజుల వ్యాలిడిటీతో యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లలో అదనపు బెనిఫిట్స్.. బింగే ఆల్ నైట్ బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే వీకెండ్ రోల్ అవర్ డేటా బెనిఫిట్స్, డేటా డిలైట్స్ ఆఫర్ అందిస్తున్నాయి. ఎయిర్ టెల్ ఇప్పుడు అలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS , 77 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ Prime Video Mobile Edition, Apollo 24| 7 సర్కిల్, షా అకాడమీతో ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్ట్ ట్యాగ్ 100 క్యాష్ బ్యాక్.. ఫ్రీ హాలో ట్యూన్స్, వైయాంక్ మ్యూజిక్ (Wynk Music) వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. రిలయన్స్ జియో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్లపై రోజుకు 1.5GB డెయిలీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, జియో యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. 84 రోజుల వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. Vodafone Idea రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో 3GB రోజువారీ డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో యాక్సెస్‌తో అందిస్తుంది. Jio రూ. 533 ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుండగా.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో 56 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24కి కూడా 7 సర్కిల్‌లు యాక్సెస్ చేసుకోవచ్చు.

Thursday, December 23, 2021

రాన్సమ్‌వేర్‌ కు విండోస్ కంప్యూటర్లే టార్గెట్ ?


రాన్సమ్‌వేర్‌ యూజర్ల కంప్యూటర్లలో పేలోడ్ డౌన్‌లోడ్ చేసి ఆ తరువాత వాటిని రిమోట్‌గా లాక్ చేస్తుంది. అనంతరం డబ్బులు అడుగుతుంది. ఈ కొత్తరకం రాన్సమ్‌వేర్‌ దాడులు కొద్దిరోజులుగా పెరిగిపోతున్నట్టు తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం వెంటనే వైరస్ అలర్ట్ జారీ చేసింది. రాన్సమ్‌వేర్‌ అనేది ఒక రకమైన మాల్‌వేర్. ఇది సిస్టమ్‌లోని ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు లేదా ముఖ్యమైన ఫైల్‌లను లాక్ చేసి.. ఆపై డబ్బును (బిట్‌కాయిన్‌ల ద్వారా) బదిలీ చేయమని యూజర్లను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. యూజర్లు తమ పీసీలోని డేటా తిరిగి పొందడం కోసం నగదు బదిలీ చేయకపోతే, ఫైల్‌లు డిలీట్ అయిపోతాయి లేదా పీసీ నిరుపయోగంగా మారుతుంది. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఐఎన్‌) తన తాజా అడ్వైజరీలో డయావోల్‌ అనే రాన్సమ్‌వేర్‌ గురించి హెచ్చరించింది. ఈ థాయ్ రాన్సమ్‌వేర్‌ మైక్రోసాఫ్ట్ విజువల్ సీ/సీ++ కంపైలర్‌తో కంపైల్ అయ్యిందని పేర్కొన్నది. "ఇది అసింక్రొనస్ ఎన్‌క్రిప్షన్‌ అల్గారిథమ్‌తో యూజర్-మోడ్ అసెమ్మెట్రిక్ ప్రొసీజర్ కాల్స్ (ఏపీసీలు) ఉపయోగించి ఫైల్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తోంది" అని అది పేర్కొంది. సీఈఆర్‌టీ-ఐఎన్‌ ప్రకారం, Diavol మాల్‌వేర్ ఈ-మెయిల్ ద్వారా కంప్యూటర్లలోకి జొరబడుతోంది. ఇందులో వన్‌డ్రైవ్‌కు తీసుకెళ్లే ఓ లింక్ ఉంటుంది. ఈ వన్‌డ్రైవ్‌ లింకుపై క్లిక్ చేయగానే అది ఒక జిప్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని యూజర్లను అడుగుతుంది. ఈ జిప్ ఫైల్‌లో ఎల్ఎన్‌కే(LNK) ఫైల్, డీఎల్ఎల్ (DLL) కలిగి ఉన్న ఐఎస్ఓ(ISO) ఫైల్‌ ఉంటుంది. ఈ ఫైల్‌ను సిస్టమ్‌లో ఓపెన్ చేశాక డాక్యుమెంట్‌ రూపంలో కనిపించే ఎల్ఎన్‌కే ఫైల్ కనిపిస్తుంది. ఇది దాన్ని క్లిక్ చేసేలా యూజర్ ను టెంప్ట్ చేస్తుంది. ఒకవేళ దానిపై క్లిక్ చేస్తే LNK ఫైల్‌ సిస్టంలో రన్ అవుతుంది. అప్పుడు పీసీలో మాల్‌వేర్ ఇన్‌ఫెక్షన్ ప్రారంభమవుతుంది. Diavol మాల్‌వేర్ పీసీకి సోకిన తర్వాత బాధిత యూజర్ డివైజ్ రిమోట్ సర్వర్‌తో రిజిస్టర్ అవుతుంది. ఆపై రన్నింగ్ ప్రాసెస్‌లు అన్ని ఆగిపోతాయి. సిస్టమ్‌లోని లోకల్ డ్రైవ్‌లు, ఫైల్‌లను ఎన్‌క్రిప్ట్ చేసేందుకు సెర్చ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఫైల్ రికవరీ సాధ్యం కాకుండా షాడో కాపీలన్నీ డిలీట్ అయిపోతాయి. ఇంకా ఇలాంటి చాలా టాస్కులు మాల్‌వేర్ ఇన్‌ఫెక్ట్ కాగానే సిస్టమ్‌పై ప్రీ-ప్రాసెస్ అవుతాయి. ఆపై ఫైల్‌లు లాక్/ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అనంతరం ఒక రాన్సమ్‌ మెసేజ్ డెస్క్‌టాప్ వాల్‌పేపర్ గా మారిపోతుంది. అప్పుడు యూజర్లు రాన్సమ్‌ చెల్లించక తప్పదు. ఈ రాన్సమ్‌వేర్‌ బారిన పడకుండా ఉండటానికి యూజర్లు సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లను లేటెస్ట్ ప్యాచ్‌లతో అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఎక్జిక్యూటబుల్ ఫైల్‌లను ఫిల్టర్ చేయడానికి ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ ఈ-మెయిల్‌లను స్కాన్ చేయాలి. తర్వాత ఎండ్ యూజర్లు ఈ తరహా అనుమానాస్పద ఈ-మెయిల్‌లు యాక్సెస్ చేయకుండా వాటిని వెంటనే డిలీట్ చేయాలి. "సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి యూజర్ల అనుమతులను పరిమితం చేయండి. అన్ని సిస్టమ్‌లు, సేవలకు "లీస్ట్ ప్రివేలెజ్" సూత్రాన్ని వర్తింపజేయండి. ఇలా మాల్వేర్ రన్ కాకుండా నిరోధించవచ్చు లేదా నెట్‌వర్క్ ద్వారా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు." అని సీఈఆర్‌టీ-ఐఎన్‌ తెలిపింది.

టీవీఎస్ అపాచీ ఆర్​టీఆర్ 165 ఆర్​పీ బైక్​ లాంచ్​


ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సంస్థ టీవీఎస్​ భారత మార్కెట్​లోకి మరో ప్రీమియం బైక్​ను  లాంచ్​ చేసింది. టీవీఎస్​ అపాచీ 165 ఆర్​పి (రేస్​ పర్ఫార్మెన్స్​) ) పేరుతో దీన్ని విడుదల చేసింది. టీవీఎస్​ ఆర్​పీ సిరీస్​లో దేశీయ మార్కెట్​లోకి వచ్చిన మొట్టమొదటి బైక్​ ​ ఇదే కావడం విశేషం. భారతదేశంలో అపాచీ ఆర్​టీఆర్​165 ఆర్​పీ రూ.1.45 లక్షల వద్ద లభిస్తుంది. ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ బైక్​లో కొన్ని మెకానికల్ ఛేంజెస్​, కొత్త స్పోర్టీ లైవరీ వంటివి చేర్చింది. కాగా, టీవీఎస్​ భారత మార్కెట్​లో అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ బైక్​లను కేవలం 200 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుందని తెలిపింది. ఈ బైక్ త్వరలోనే బుకింగ్‌లకు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​165 ఆర్​పీ బైక్.. 164.9 సీసీ సింగిల్- సిలిండర్, ఫోర్​ -వాల్వ్ ఇంజన్‌తో లభిస్తుంది. 10,000 ఆర్​పీఎం వద్ద 19 బీహెచ్​పీ, 8,750 ఆర్​పీఎం వద్ద 14 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 35 శాతం కొత్త సిలిండర్ హెడ్, 15 శాతం పెద్ద వాల్వ్‌లు, ఫ్రీ-రివింగ్ కోసం రివైజ్డ్ బోర్ స్ట్రోక్, అధిక కంప్రెషన్ రేషియో, కొత్త డోమ్ పిస్టన్‌లని కలిగి ఉంటుంది. ఇది పవర్‌ప్లాంట్ స్లిప్పర్ క్లచ్‌తో ఐదు -స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేసి ఉంటుంది. అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీలో 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో 240 ఎంఎం బ్యాక్​ డిస్క్ బ్రేక్​లను అమర్చింది. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ రేసింగ్ డీకాల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, రెడ్ అల్లాయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, బ్రాస్-కోటెడ్ డ్రైవ్ చైన్, స్ప్రాకెట్, కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్​, రెడ్​ సీటు ప్యాటర్న్​, వెనుక వైపు రేడియల్ టైర్‌లను అమర్చింది. ఈ బైక్​ లాంచింగ్​పై టీవీఎస్​ మార్కెటింగ్​ ప్రీమియం బిజినెస్​ హెడ్​ మేఘశ్యామ్ డిఘోల్ మాట్లాడుతూ, ''మా కస్టమర్లకు రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్​పీ సిరీస్‌లోని రేస్​ మెషీన్లు మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. బ్లిస్టరింగ్ పర్ఫార్మెన్స్​ను అందించే ఏకైక ఉద్దేశ్యంతో వీటిని రూపొందించాం. ఇవి రేసింగ్ ట్రాక్ & హైవే రోడ్లపై వేగంగా ప్రయాణించగలవు." అని అన్నారు. కాగా, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొదటి ప్రొడక్ట్. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఫీచర్లతో విడుదలైంది.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బెస్ట్ ప్లాన్స్


బిఎస్ ఎన్ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే ధమాకా ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ కేవలం రూ.500 రూపాయల కంటే తక్కువైనా కూడా అన్లిమిటెడ్ సర్వీస్ లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను అఫర్ చేస్తాయి. అంతేకాదు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతోనే ఒక నెల వ్యాలిడిటీ మొదలుకొని 10 నెలల వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్స్ ను కూడా BSNL అందించింది.  బిఎస్ ఎన్ఎల్ యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. రూ.249 అన్ లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. రూ.397 అన్ లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి. రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం


ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది. కేవలం 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఈ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఒక డెవలప్‌మెంట్ మిస్సైల్‌ను రెండు వరుస రోజుల్లో విజయవంతంగా పరీక్షించడం ఇదే మొదటిసారని వారు చెప్పారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సక్సెస్‌ఫుల్‌గా చేధించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ఈ ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ క్షిపణిని రూపొందించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.


వివో 2 స్మార్ట్‌వాచ్ విడుదల


గత ఏడాదిలో వివో వాచ్ పేరుతో స్మార్ట్‌వాచ్ లాంఛ్ చేసిన వివో తాజాగా దానికి కొనసాగింపుగా వివో వాచ్2ను లాంఛ్ చేసింది. ఇతర బ్రాండ్లకు దీటుగా స్లీక్ డిజైన్‌, పలు హైఎండ్ పీచర్లతో వివో వాచ్‌2ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈసిమ్ ద్వారా ఎస్ఎంఎస్ ఫంక్షనాలిటీ ఫీచర్ కలిగిన వివో తొలి స్మార్ట్‌వాచ్ ఇదే కావడం గమనార్హం. 46ఎంఎం కేసు, బ్లాక్‌, వైట్ కలర్స్‌లో రెండు సిలికాన్ స్ట్రాప్ కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఒకసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల పాటు పనిచేసే 515ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. వివో వాచ్ 2 అమోల్డ్ డిస్‌ప్లేతో స్టెయిల్‌లెస్ స్టీల్ బాడీతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్‌, ఎస్‌పీఓ2 సెన్సర్‌తో పాటు 11 స్పోర్ట్స్ మోడల్స్‌, బ్లూటూత్ 5.0 సపోర్ట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్‌, యాంబియంట్ లైట్ సెన్సర్ వంటి పలు ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ 15,300గా కంపెనీ నిర్ణయించింది.


Wednesday, December 22, 2021

త్వరలో రిలీజ్ కానున్న రియల్‌మీ 9i


రెండు నెలలుగా ఇండియాలో ఎలాంటి మొబైల్ ఫోన్ లాంచ్ చేయని రియల్‌మీ అతి త్వరలోనే రియల్‌మీ 9 సిరీస్‌ను  రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన లీక్ వెలుగు చూసింది. ఈ ఫ్రెష్ లీక్ ప్రకారం, గ్లోబల్‌ వెర్షన్ అయిన రియల్‌మీ 9ఐ భారత్‌లో రియల్‌మీ నార్జో 9ఐ గా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రియల్‌మీ 9 ప్రో+ ఫీచర్స్ లీక్స్ అయ్యాయి. రియల్‌మీ 9 సిరీస్‌లో రియల్‌మీ 9, రియల్‌మీ 9ఐ, రియల్‌మీ 9 ప్రో+/మ్యాక్స్ ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో రియల్‌మీ 9ఐ రీబ్రాండ్ వెర్షన్ గా వచ్చే రియల్‌మీ నార్జో 9ఐ స్పెసిఫికేషన్లకు సంబంధించి ర్యామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్ వంటి వివరాలు లీక్ అయ్యాయి. రియల్‌మీ 9 సిరీస్‌లోని ప్రో వెర్షన్ కూడా త్వరలో విడుదల కానుందని సమాచారం.

బౌల్ట్ నుంచి లేటెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంచ్


ఇటీవల కాలంలో ఇయర్ ఫోన్లు, ఇయర్‌బడ్స్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బౌల్ట్ బ్రాండ్ వరుసగా ప్రొడక్టులను మార్కెట్లోకి వదులుతోంది. తాజాగా ఈ సంస్థ ఎయిర్ బాస్ ప్రోపాడ్స్ ఎక్స్  ట్రూ వైర్లెస్ స్టీరియో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ వెర్లెస్ ఇయర్ బడ్స్ లో 10ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. టచ్ కంట్రోల్ ద్వారా కాల్ రిజెక్షన్స్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, మ్యూజిక్ ట్రాక్ లాంటి వాటిని నియంత్రించవచ్చు. టైప్-సీ యూఎస్బీ పోర్టును కలిగి ఉన్న ఈ ఇయర్ ఫోన్లకు IPX5 రేటింగ్ ఇచ్చారు. స్వెట్‌, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ ఉన్న ఈ ఇయర్ బడ్స్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి, 32 గంటల పాటు ప్లే టైమ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ సరికొత్త బౌల్ట్ ఎయిర్ బాస్ ప్రోపాడ్స్ ఎక్స్ ఇయర్ ఫోన్లు ధర భారత్ లో రూ.1499గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్ లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తున్నాయి. అందుబాటులో ధరతో పాటు సంవత్సరం పాటు వీటికి ఇండస్ట్రీ వారంటీని కూడా ఇచ్చింది ఈ కంపెనీ. ఈ సరికొత్త బౌల్ట్ ఇయర్‌ఫోన్లు 10 ఎంఎం ఆడియో డ్రైవర్స్, ఇన్ బిల్ట్ మైక్రో వూఫర్లతో వస్తాయి. వీటి ద్వారా పవర్ ఫుల్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ప్రతి ఇయర్ బడ్ కు మైక్రోఫోన్ సౌలభ్యం కూడా ఉంది. ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సిలికాన్ టిప్స్ ను వీటిలో పొందుపరిచారు. టచ్ కంట్రోల్స్ సాయంతో వివిధ రకాల సర్వీసెస్‌ను కంట్రోల్ చేయవచ్చు. కాల్ రిజెక్షన్స్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, మ్యూజిక్ ట్రాక్ లాంటి వాటిని నియంత్రించవచ్చు. వాయిస్ అసిస్టెంట్లు అయిన సిరి, గూగుల్ అసిస్టెంట్లకు కూడా ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ ఉన్న ఈ ఇయర్ ఫోన్లు వర్షం, నీరు, చెమటతో ఏమాత్రం ప్రభావితం కావు. బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఆప్షన్ వీటిలో ఉంది. ఈ సరికొత్త ఇయర్ బడ్స్ ఆటో పెయిరింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి. అంటే విడిగా వీటిని ఉపయోగించవచ్చు. కాల్స్ తీసుకోవడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి స్టీరియో మోడ్, మోనో పాడ్ లో ఉపయోగించుకోవచ్చు. టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల 10 నిమిషాల ఛార్జ్ తో 100 నిమిషాల వరకు ప్లేబ్యాక్ టైమ్ పొందవచ్చు. పూర్తి ఛార్జ్ తో 8 గంటల ప్లేటైమ్ వస్తుంది. గరిష్ఠంగా 32 గంటల పాటు వినియోగించవచ్చు.

అలరించనున్న 5 కొత్త ఫీచర్లు !


కొత్త ఏడాదిలో మరిన్ని ఫీచర్లతో ముందుకు వాట్సాప్​  రానుంది. కాల్ ఇంటర్‌ఫేస్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​, క్విక్​ రిప్లయిస్​, కమ్యూనిటీస్​ వంటి  ఫీచర్లను పరిచయం చేయనుంది.

కొత్త కాలింగ్ ఇంటర్‌ఫేస్ :  కాలింగ్ ఫీచర్​ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటి. ఇది సెల్యులార్ లేదా వైఫై కనెక్షన్ ద్వారా యాప్ నుంచి నేరుగా వాయిస్ కాల్స్​ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ముఖ్యంగా గ్రూప్ కాల్‌ల సమయంలో యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇంటర్​ఫేజ్​ పనిచేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​ బీటా యూజర్లకు ఏకకాలంలో ఈ ఇంటర్​ఫేస్​ అందుబాటులోకి రానుంది.

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​ :  చాట్‌లు, కాల్‌లకు కొత్త ఇండికేటర్స్​ను జోడించనుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​​ ద్వారా మీ కాల్స్​, ఫోటోలు, వీడియోలు మరింత భద్రంగా ఉంటాయి. ఈ ఫీచర్​ ఏకకాలంలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

క్విక్​ రిప్లయిస్​ : బిజినెస్​ అకౌంట్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్​ను పరిచయం చేయనుంది. ఐవోఎస్​, ఆండ్రాయిడ్​ ప్లాట్​ఫామ్స్​ కోసం దీన్ని తీసుకురానుంది. వాట్సాప్​ బిజినెస్ అకౌంట్ యూజర్లు తరచూ పంపించే మోసేజ్​లకు క్విక్​ రిప్లయిస్​ ఇచ్చేందుకు "/" అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఫీచర్​ను​ ఛాట్​షేర్​ యాక్షన్​ మెనూకి సైతం చేర్చనున్నారు.

గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్స్​ : త్వరలో గ్రూప్ అడ్మిన్ల కోసం మరో కొత్త ఫీచర్​ను జోడించనుంది. ఈ ఫీచర్ గ్రూప్‌లోని ఇతర సభ్యులు సైతం మెసేజెస్​ను డిలీట్​ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు, గ్రూప్ సభ్యుల అవాంఛిత ప్రవర్తనను నియంత్రించడానికి అడ్మిన్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది.

కమ్యూనిటీస్​ :  కొత్త కమ్యూనిటీలను క్రియేట్​ చేసే ఫీచర్​ను కూడా పరిచయం చేయనుంది. కమ్యూనిటీ ఇన్వైట్​ లింక్ ద్వారా కొత్త యూజర్లను ఆహ్వానించే సామర్థ్యం కమ్యూనిటీ అడ్మిన్​కి ఇస్తుంది. కమ్యూనిటీ అడ్మిన్లు గ్రూప్‌ల్లో గ్రూప్‌లను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ తొలుత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు వచ్చే అవకాశం ఉంది.

25 వేలకే హీరో ప్యాషన్ ప్రో కొనుగోలు చేసే అవకాశం !


భారత్‌లో యూజ్డ్ కార్లు, బైక్‌ల మార్కెట్ గతంతో పోలిస్తే బాగా పెరిగింది. చాలా మంది బాగా ప్రాక్టీస్ చేయడానికి కొత్తదానికి బదులుగా మొదట్లో ఉపయోగించిన కారు లేదా బైక్‌ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. దేశంలోని ద్విచక్ర వాహన రంగంలో మంచి మైలేజీతో కూడిన అనేక చౌక బైక్‌లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసేంత చౌకగా లేవు. అంటే, ఆచరణలో కాకుండా, బడ్జెట్ మరొక కారణం, దీని కారణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ బైక్‌లను ఇష్టపడతారు. భారతదేశంలో అత్యధికంగా ఇష్టపడే బైక్‌లలో హీరో ప్యాషన్ ప్రో బైక్ ఒకటి. మీరు దాని మోడల్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ.70,375 నుండి రూ.75,100 వరకు అవసరం. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు దాని పాత మోడల్‌ను కొనుగోలు చేయడం మంచిది. హీరో ప్యాషన్ ప్రో , పాత మోడల్ ప్రస్తుతం Bikes24లో అందుబాటులో ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ టూ వీలర్‌లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి మీరు సదుపాయాన్ని పొందే వెబ్‌సైట్. పాత హీరో ప్యాషన్ ప్రో అదే వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. సెకండ్ హ్యాండ్ ప్యాషన్ ప్రో ఈ వెబ్‌సైట్‌లో కేవలం 25 వేల రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ బైక్ , 2013 మోడల్‌ను విక్రయిస్తున్నారు. విక్రయించబడుతున్న పాత మోడల్ హీరో ప్యాషన్ ప్రో  హీరో ప్యాషన్ ప్రోను మొదటి యజమాని విక్రయిస్తున్నారు. ఢిల్లీలో రిజిస్టర్ చేయబడిన ఈ బైక్‌కి 1-సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. బైక్‌పై ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే మీరు దీన్ని ఏడు రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ ప్లాన్‌తో పొందుతారు. మనీ బ్యాక్ గ్యారెంటీ ప్లాన్ కింద, మీకు బైక్ నచ్చకపోతే, మీరు దానిని తిరిగి ఇచ్చి, పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చు.

క్రోమా లో క్రిస్మస్ ఆఫర్లు..!


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల అమ్మకదారు అయిన క్రోమా మరో సేల్ తో వచ్చింది.  క్రిస్మస్ సేల్ లో, రిటైల్ చైన్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, హెడ్‌ఫోన్‌లు మరియు మరెన్నో ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులను అందిస్తోంది.  బ్లూటూత్ స్పీకర్ల పై గరిష్టంగా 70 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై 6 నెలల వరకు నో కాస్ట్ EMI అందుబాటులో ఉంటాయి Apple, Samsung మరియు OnePlus వంటి బ్రాండ్‌ల నుండి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు క్రిస్మస్ సేల్ సమయంలో క్రోమాలో 6 నెలల వరకు నో-కాస్ట్ EMIతో అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లపై 6 నెలల వరకు నో కాస్ట్ EMI అందుబాటులో ఉంటాయి Samsung, Lenovo మరియు Apple వంటి బ్రాండ్‌ల నుండి టాబ్లెట్‌లపై నో-కాస్ట్ EMI ప్లాన్‌లను పొందవచ్చు. Sony, Canon మరియు Nikon వంటి బ్రాండ్‌ల నుండి డిజిటల్ కెమెరాలు క్రిస్మస్ సేల్ సమయంలో క్రోమా లో 25 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి.75 శాతం తగ్గింపుతో క్రోమాలో గేమింగ్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.

Popular Posts