Ad Code

1 నుంచి ఆర్ బి ఐ కొత్త రూల్స్


బ్యాంకు అకౌంట్ దారులకు అలర్ట్.. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలో నగదు విత్‌డ్రాపై కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. గతంలో ఏటీఎంల్లో నుంచి నగదు ఉపసంహరణకు చెల్లించిన మొత్తం కంటే అధిక మొత్తంలో బ్యాంకు అకౌంట్ దారులు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీ విత్ డ్రా లిమిట్ దాటిన వెంటనే ఈ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్‌లకు పెరిగిన ఛార్జీల నోటిఫికేషన్‌లను పంపిస్తున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఈ కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయని,  ఏటీఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత పరిమితిని మించి రూ. 20+ ట్యాక్స్ నుంచి రూ. 21+ ట్యాక్స్ కు సవరించింది. ఇప్పటికే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో నోటీసును ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్  ఏటీఎం లలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలపై రూ. 21 + GST వర్తించనుందని యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉచిత నెలవారీ పరిమితి దాటిన తర్వాత నగదు, నగదు రహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులకు అనుమతించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. కస్టమర్‌లు నగదును ఉపసంహరించుకోవడానికి గతంలో చెల్లించిన దానికంటే రూ. 1 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1, 2022 నుంచి కస్టమర్‌లు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే.. ప్రతి లావాదేవీకి రూ. 20కి బదులుగా రూ. 21 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు అధిక ఇంటర్‌చేంజ్ చార్జీలను అందించేందుకు ఖర్చుల సాధారణ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ప్రతి లావాదేవీపై కస్టమర్ నుంచి ఛార్జీలను రూ. 21కి పెంచేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఈ కొత్త చార్జీలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటనలో వెల్లడించింది. డెబిట్ కార్డ్‌లను కలిగిన అన్ని బ్యాంక్ కస్టమర్‌లు నెలకు వారి అకౌంట్ బ్రాంచ్ ఏ టి ఎం లలో ఉచితంగా 5 వరకు లావాదేవీలకు అనుమతి ఉంటుంది. అందులో నగదు లేదా నగదు రహిత లావాదేవీలు చేసుకునేందుకు అర్హులుగా ఆర్బీఐ పేర్కొంది. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల నుంచి 3 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఉచిత నెలవారీ పరిమితులకు మించి నగదు, నగదు రహిత ఏ టి ఎం లపై ఛార్జీలను పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్  బ్యాంకులను అనుమతించింది.

Post a Comment

0 Comments

Close Menu