Ad Code

10 నిముషాల్లో పాన్ కార్డు పొందండి !


ప్రభుత్వం అందించిన కొత్త సదుపాయంతో కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు. మీరు ఇప్పటి వరకూ అప్లై చేయనట్లయితే చాలా సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు, ఈ పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవడమేకాకుండా ePAN ను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియా అందించిన కొత్త సదుపాయంతో కేవలం 10 నిముషాల్లో పాన్ కార్డు పొందవచ్చు. దీనికోసం మీరు మీ ఆధార్ కార్డ్ కలిగి ఉంటే సరిపోతుంది. https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్సైట్ కి వెళ్లాలి, ఇక్కడ మీరు ఎడమ వైపున కనిపించే "Instant PAN through Aadhaar" పై క్లిక్ చేయానాది, మీరు కొత్త పేజీకి మళ్ళించబడతారు, ఈ పేజీలో మీరు "Get New PAN" అప్షన్ పైన నొక్కండి. ఇక్కడ మీకు అప్లికేషన్ కనపడుతుంది. బాక్సులో మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి మరియు OTP కోసం  కోడ్ ఎంటర్ చెయ్యాలి. ఆధార్ కార్డుతో అనుసంధానము చేసిన  రిజిష్టర్ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది. మీ రిజిష్టర్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.  తరువాత, మీరు పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం ఇ-మెయిల్ ఐడిని ధృవీకరించండి.  ఈ విధంగా ఈ ఫారమ్ ను పూర్తి చేసిన తర్వాత, కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ నంబర్ ను పొందుతారు మరియు దీనిని మీరు కావాలనుకుంటే PDF ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం, మీరు "చెక్ స్టేటస్ / డౌన్లోడ్ పాన్" ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్సైట్ నుండి PDF ఫైల్ లో పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ, మీకు హార్డ్ కాపీ కావాలంటే, దాని కోసం మీరు 50 రూపాయలు చెల్లించాలి.

Post a Comment

0 Comments

Close Menu