Ad Code

అమెజాన్​లో ఐఫోన్ 12 ప్రోపై రూ. 25 వేల తగ్గింపు


మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ కు కొత్త ఫోన్​ కొనాలని చాలా మంది ప్లాన్​ చేస్తుంటారు. అయితే, అటువంటి వారికి దాదాపు నెల రోజుల ముందే న్యూఇయర్​ ఆఫర్​ తీసుకొచ్చింది ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ . ఐఫోన్​ 12  ప్రో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం బిగ్​ డీల్​ ప్రకటించింది. ఈ డిల్ కింద ఐఫోన్​ 12 ప్రో మోడల్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మోడల్​పై ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. ఐఫోన్​ 12 ప్రోకు చెందిన అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్​ వర్తిస్తుందని అమెజాన్​ స్పష్టం చేసింది. ఐఫోన్​ 12 ప్రో 128 జీబీ పసిఫిక్ బ్లూ వేరియంట్ అసలు ధర రూ.1,19,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 94,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 25 వేల వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కింద గరిష్టంగా రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ, మీరు 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల కోసం చూస్తున్నట్లయితే, వాటిపై కూడా భారీ డిస్కౌంట్​ పొందవచ్చు. ఐఫోన్​ 12 ప్రో 256 జీబీ వేరియంట్‌ను రూ. 99,990 ధర వద్ద విక్రయిస్తోంది. అంటే దీనిపై మీకు రూ. 30,000 డిస్కౌంట్​ లభిస్తుంది. మరోవైపు, 512 జీబీ వేరియంట్​పై రూ. 42,000 ఆదా చేసుకోవచ్చు. ఇది మీకు కేవలం రూ. 1,07,900 వద్ద లభిస్తుంది. కేవలం ఐఫోన్​ 12 ప్రో పైనే కాకుండా ఎయిర్​పాడ్స్​పై కూడా డిస్కౌంట్ (Discount)​ పొందవచ్చు. మీరు అమెజాన్​లో ఆపిల్ ఐఫోన్​​ 12 ప్రో, ఎయిర్​పాడ్స్​ ప్రో కాంబోను రూ. 1,15,395 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కాంబో అసలు ధర రూ.1,44,800 వద్ద ఉండగా.. దీనిపై దాదాపు రూ. 28,910 ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్​ 13పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్​ ఉండదని అమెజాన్​ స్పష్టం చేసింది. ఆపిల్ ఐఫోన్​ 13 మినీ బేస్ వేరియంట్ రూ.69,900 వద్ద లభిస్తుంది. ఇక 256 జీబీ వేరియంట్​ రూ. 79,900, 512 జీబీ వేరియంట్​ రూ. 99,900 వద్ద అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu