Ad Code

టీవీఎస్ అపాచీ ఆర్​టీఆర్ 165 ఆర్​పీ బైక్​ లాంచ్​


ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సంస్థ టీవీఎస్​ భారత మార్కెట్​లోకి మరో ప్రీమియం బైక్​ను  లాంచ్​ చేసింది. టీవీఎస్​ అపాచీ 165 ఆర్​పి (రేస్​ పర్ఫార్మెన్స్​) ) పేరుతో దీన్ని విడుదల చేసింది. టీవీఎస్​ ఆర్​పీ సిరీస్​లో దేశీయ మార్కెట్​లోకి వచ్చిన మొట్టమొదటి బైక్​ ​ ఇదే కావడం విశేషం. భారతదేశంలో అపాచీ ఆర్​టీఆర్​165 ఆర్​పీ రూ.1.45 లక్షల వద్ద లభిస్తుంది. ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ బైక్​లో కొన్ని మెకానికల్ ఛేంజెస్​, కొత్త స్పోర్టీ లైవరీ వంటివి చేర్చింది. కాగా, టీవీఎస్​ భారత మార్కెట్​లో అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ బైక్​లను కేవలం 200 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుందని తెలిపింది. ఈ బైక్ త్వరలోనే బుకింగ్‌లకు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​165 ఆర్​పీ బైక్.. 164.9 సీసీ సింగిల్- సిలిండర్, ఫోర్​ -వాల్వ్ ఇంజన్‌తో లభిస్తుంది. 10,000 ఆర్​పీఎం వద్ద 19 బీహెచ్​పీ, 8,750 ఆర్​పీఎం వద్ద 14 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 35 శాతం కొత్త సిలిండర్ హెడ్, 15 శాతం పెద్ద వాల్వ్‌లు, ఫ్రీ-రివింగ్ కోసం రివైజ్డ్ బోర్ స్ట్రోక్, అధిక కంప్రెషన్ రేషియో, కొత్త డోమ్ పిస్టన్‌లని కలిగి ఉంటుంది. ఇది పవర్‌ప్లాంట్ స్లిప్పర్ క్లచ్‌తో ఐదు -స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేసి ఉంటుంది. అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీలో 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో 240 ఎంఎం బ్యాక్​ డిస్క్ బ్రేక్​లను అమర్చింది. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ రేసింగ్ డీకాల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, రెడ్ అల్లాయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, బ్రాస్-కోటెడ్ డ్రైవ్ చైన్, స్ప్రాకెట్, కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్​, రెడ్​ సీటు ప్యాటర్న్​, వెనుక వైపు రేడియల్ టైర్‌లను అమర్చింది. ఈ బైక్​ లాంచింగ్​పై టీవీఎస్​ మార్కెటింగ్​ ప్రీమియం బిజినెస్​ హెడ్​ మేఘశ్యామ్ డిఘోల్ మాట్లాడుతూ, ''మా కస్టమర్లకు రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్​పీ సిరీస్‌లోని రేస్​ మెషీన్లు మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. బ్లిస్టరింగ్ పర్ఫార్మెన్స్​ను అందించే ఏకైక ఉద్దేశ్యంతో వీటిని రూపొందించాం. ఇవి రేసింగ్ ట్రాక్ & హైవే రోడ్లపై వేగంగా ప్రయాణించగలవు." అని అన్నారు. కాగా, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 165 ఆర్​పీ రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొదటి ప్రొడక్ట్. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఫీచర్లతో విడుదలైంది.

Post a Comment

0 Comments

Close Menu