2022లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ?


టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఓఎస్ అయిన ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ చాలా డివైజ్‌లకు రాకముందే, కొత్త టెక్నాలజీపై గూగుల్ దృష్టి సారించింది. తాజాగా ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం XDA డెవలపర్స్ షేర్ చేసింది. వీటిలో ఆండ్రాయిడ్ 13లో రానున్న లేటెస్ట్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. నోటిఫికేషన్స్ రిక్వెస్ట్, లాంగ్వేజ్ కంట్రోల్స్, సరికొత్త బ్లూటూత్ టెక్నాలజీ సపోర్ట్ వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేసి, లాంచ్ చేయగానే.. కెమెరా, మైక్, లొకేషన్, స్టోరేజ్, కాంటాక్ట్‌లు, ఫోన్, క్యాలెండర్‌ను యాక్సెస్ చేయడానికి యూజర్ల రిక్వెస్ట్ కోరతాయి. అయితే ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌లో కొత్తగా నోటిఫికేషన్స్ సెండ్ చేసేందుకు కూడా కస్టమర్లను యాప్స్ రిక్వెస్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 12 వరకు వచ్చిన ఓఎస్‌లలో యాప్స్‌ కస్టమర్ల అనుమతి లేకుండా నేరుగా నోటిఫికేషన్స్ సెండ్ చేసేవి. ఆ తరువాత అవి అవసరం లేదనుకుంటే యూజర్లు బ్లాక్ చేసుకునేవారు. ఆండ్రాయిడ్ 13 'టిరామిసు' అనే ఇంటర్నల్ కోడ్ నేమ్‌తో రానుంది. మే 2022 నాటికి గూగుల్ దీని గురించి ప్రకటించి, సెప్టెంబర్ 2022 నాటికి స్టాండర్డ్స్ బిల్డ్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే లీక్ అయిన ఫీచర్లను డెవలపర్లు టెస్టింగ్ చేసి, భవిష్యత్తు అవసరాల ప్రకారం మార్చుకునే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఓఎస్ అందుబాటులోకి వచ్చేనాటికి, ఇందులో ప్రస్తుత ఫీచర్లు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం

Post a Comment

0 Comments