Ad Code

2022 ద్వితీయార్ధం వరకూ వెంటాడనున్న చిప్ కొరత!


ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత వెంటాడుతున్న నేపధ్యంలో వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకూ ఈ సమస్య కొనసాగుతుందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అంచనా వేసింది. స్మార్ట్‌పోన్ విడి పరికరాల సరఫరాదారులతో శాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ టీఎం రోహ్ భేటీ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో శాంసంగ్ మొబైల్ చీఫ్ చిప్ కొరతపై చర్చించారు. చిప్ కొరతను అధిగమించేందుకు శాంసంగ్ పలు చర్యలు చేపడుతోందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చిప్ సరఫరాదారులతో వార్షిక కాంట్రాక్టుల కోసం ప్రయత్నలు ముమ్మరం చేసింది. గతంలో రెండు వారాలకు సరిపడా ఉన్న చిప్ సరఫరాల నిల్వలు ఇప్పుడు నాలుగు వారాలకు పెరిగాయి. ఇక చిప్ కొరతతో వచ్చే ఏడాది జనవరిలో లాంఛ్ కావాల్సిన గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను ఫిబ్రవరికి వాయిదా వేసిన కంపెనీ చిప్ సరఫరాల మెరుగుదలపై దృష్టిసారించింది. మరోవైపు చిప్ కొరత సమస్యను అధిగమిస్తున్నామని, వచ్చే ఏడాదిలో పరిస్ధితి మరింత మెరుగుపడుతుందని క్వాల్‌కాం సీఈఓ క్రిస్టియనో అమన్ పేర్కొన్నారు. ఇక పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు క్వాల్‌కాం నుంచి తగినన్ని ప్రాసెసర్లు సమీకరించలేకపోవడం ఆయా స్మార్ట్‌ఫోన్ల తయారీపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.


Post a Comment

0 Comments

Close Menu