Ad Code

ఎస్‌22 అల్ట్రా లాంఛ్ డేట్ ఫిబ్రవరి 8


ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 8న గెలాక్సీ ఎస్‌22 సిరీస్ ఇతర మోడల్స్ లాంఛ్ వివరాలను శాంసంగ్ వెల్లడించనుంది. గెలాక్సీ ఎస్‌21 సిరీస్ మాస్ ప్రొడక్షన్ వచ్చే నెలలో మొదలవనుండగా 2022 జనవరి నాటికి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్‌లో అన్ని మోడళ్లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 చిప్‌సెట్‌తో ముందుకురానున్నాయి. ఇక గెలాక్సీ ఎస్‌22|ఎస్‌22+ మోడల్స్ అత్యాధునిక ఫీచర్లతో ఉండేలా శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది. గెలాక్సీ ఎస్‌22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 10 ఎంపీ టెలిఫోటో లెన్స్‌లతో 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తాయని చెబుతున్నారు.


Post a Comment

0 Comments

Close Menu