Ad Code

జనవరిలో వివో వి 23 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల


చైనీస్​ స్మార్ట్​బ్రాండ్​ వివో వరుసగా స్మార్ట్​ఫోన్లు రిలీజ్​ చేస్తూ మార్కెట్​లో విస్తరిస్తోంది. అదే వేగంతో 2022 జనవరిలో వివో వి 23 ప్రో మోడల్‌ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన వివో వి21కు కొనసాగింపుగా వివో వి23 సిరీస్​ రానుంది. వివో వి23 ప్రో విడుదలైన తర్వాత వివో బేస్​ వి23 బేస్​ వెర్షన్ కూడా అదే నెలలో విడుదల కానుంది. వివో వి23 ప్రో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీనిలో 8 -మెగాపిక్సెల్, 2 -మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాలను అందించనుంది. వివో వి23 ప్రో జనవరి 4న లేదా జనవరి మొదటి వారంలో విడుదలకానుందని 91 మొబైల్స్​ నివేదిక పేర్కొంది. దీని తర్వాత అదే నెలలో వివో V23 బేస్ వెర్షన్​ కూడా మార్కెట్​లోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu