Ad Code

అలరించనున్న 5 కొత్త ఫీచర్లు !


కొత్త ఏడాదిలో మరిన్ని ఫీచర్లతో ముందుకు వాట్సాప్​  రానుంది. కాల్ ఇంటర్‌ఫేస్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​, క్విక్​ రిప్లయిస్​, కమ్యూనిటీస్​ వంటి  ఫీచర్లను పరిచయం చేయనుంది.

కొత్త కాలింగ్ ఇంటర్‌ఫేస్ :  కాలింగ్ ఫీచర్​ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటి. ఇది సెల్యులార్ లేదా వైఫై కనెక్షన్ ద్వారా యాప్ నుంచి నేరుగా వాయిస్ కాల్స్​ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ముఖ్యంగా గ్రూప్ కాల్‌ల సమయంలో యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇంటర్​ఫేజ్​ పనిచేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​ బీటా యూజర్లకు ఏకకాలంలో ఈ ఇంటర్​ఫేస్​ అందుబాటులోకి రానుంది.

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​ :  చాట్‌లు, కాల్‌లకు కొత్త ఇండికేటర్స్​ను జోడించనుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇండికేటర్స్​​ ద్వారా మీ కాల్స్​, ఫోటోలు, వీడియోలు మరింత భద్రంగా ఉంటాయి. ఈ ఫీచర్​ ఏకకాలంలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

క్విక్​ రిప్లయిస్​ : బిజినెస్​ అకౌంట్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్​ను పరిచయం చేయనుంది. ఐవోఎస్​, ఆండ్రాయిడ్​ ప్లాట్​ఫామ్స్​ కోసం దీన్ని తీసుకురానుంది. వాట్సాప్​ బిజినెస్ అకౌంట్ యూజర్లు తరచూ పంపించే మోసేజ్​లకు క్విక్​ రిప్లయిస్​ ఇచ్చేందుకు "/" అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఫీచర్​ను​ ఛాట్​షేర్​ యాక్షన్​ మెనూకి సైతం చేర్చనున్నారు.

గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్స్​ : త్వరలో గ్రూప్ అడ్మిన్ల కోసం మరో కొత్త ఫీచర్​ను జోడించనుంది. ఈ ఫీచర్ గ్రూప్‌లోని ఇతర సభ్యులు సైతం మెసేజెస్​ను డిలీట్​ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు, గ్రూప్ సభ్యుల అవాంఛిత ప్రవర్తనను నియంత్రించడానికి అడ్మిన్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది.

కమ్యూనిటీస్​ :  కొత్త కమ్యూనిటీలను క్రియేట్​ చేసే ఫీచర్​ను కూడా పరిచయం చేయనుంది. కమ్యూనిటీ ఇన్వైట్​ లింక్ ద్వారా కొత్త యూజర్లను ఆహ్వానించే సామర్థ్యం కమ్యూనిటీ అడ్మిన్​కి ఇస్తుంది. కమ్యూనిటీ అడ్మిన్లు గ్రూప్‌ల్లో గ్రూప్‌లను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ తొలుత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu