Ad Code

జనవరి 6న షియోమి 11ఐ హైపర్‌చార్జ్ విడుదల !

భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న షియోమి 11ఐ హైపర్‌చార్జ్ జనవరి 6న లాంఛ్ కానుంది. లాంఛ్‌కు ముందు టీజర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ను షియోమి వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో చైనాలో ప్రవేశపెట్టిన రెడ్‌మి నోట్ 11 ప్రొ+ రీబ్రాండెడ్ వెర్షన్‌గా షియోమి 11ఐ హైపర్‌చార్జ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 920 చిప్‌సెట్‌తో 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ కేవలం 15 నిమిషాల్లో చార్జింగ్ పూర్తవుతుంది. భారత్‌లో ఇదే అత్యంత వేగవంతమైన చార్జింగ్ డివైజ్ అని షియోమి చెబుతోంది. షియోమి 11ఐ హైపర్‌చార్జ్ పసిఫిక్ పెర్ల్‌, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. షియోమి 11ఐ హైపర్‌చార్జ్ 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్‌, 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఎఫ్‌హెచ్‌డీ+ 6.67 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్‌తో రానున్న ఈ స్మార్ట్‌పోన్ ధర రూ 22,000 నుంచి రూ 26,000 మధ్య అందుబాటులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu