Ad Code

టెక్నో స్పార్క్ 8


బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సంస్థ “టెక్నో” తన “స్పార్క్ సిరీస్”లో మరో కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ లో ఇప్పటికే ఉన్న స్పార్క్ 8 ఫోన్ ను మరింత అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. టెక్నో ఫోన్ లు తక్కువ ధరలో, సరాసరి ఫీచర్స్ తో అందరికి అందుబాటులో ఉంటాయి. హై ఎండ్ ఫీచర్స్ తో ఒకవైపు ప్రీమియం ఫోన్ లు ఊరిస్తున్నా, దాదాపు అలాంటి ఫీచర్స్ నే అందిస్తూ మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు బడ్జెట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నో స్పార్క్ సిరీస్ ఫోన్లు.. సంస్థ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్ధ్యాన్ని 256జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే “టెక్నో” స్పార్క్ 8, 1612 x 720 HD+ రిజల్యూషన్, 6.56-అంగుళాల డాట్ నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే గరిష్టంగా 480 నిట్‌ల ప్రకాశం కలిగి ఉంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో వస్తున్న ఈఫోన్, ఏడాదికి పైగా అప్డేట్స్ అందుకుంటుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈఫోన్ టెక్నో సొంత ఇంటర్ఫేస్ HiOSతో రన్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో 16 మెగా పిక్సెల్ సామర్ధ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన జంట కెమెరాలు ఉండగా, ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. వెనుక కెమెరా AI పోర్ట్రెయిట్, AR ఫిల్టర్‌లు, టైమ్‌లాప్స్ వీడియోలు తీసుకోవచ్చు. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సియాన్ మరియు ఐరిస్ పర్పుల్ వంటి మూడు రంగులలో ఈ కొత్త “టెక్నో స్పార్క్ 8” స్మార్ట్ ఫోన్ లభించనుంది.


Post a Comment

0 Comments

Close Menu